Home / తప్పక చదవాలి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సర్వమత ప్రార్థణల అనంతరం సచివాలయంలోని బ్లాక్ 2లో తనకు కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
కన్నడ నటుడు దర్శన్ తూగుదీప మేనేజర్ శ్రీధర్ బెంగుళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. శ్రీధర్ మృతదేహంతో పాటు సూసైడ్ నోటు, వీడియో మెసేజును పోలీసులు గుర్తించారు. తన చావుకు తానే కారణమని దర్యాప్తులో తన కుటుంబాన్ని చేర్చవద్దని లేఖలో శ్రీధర్ పేర్కొన్నారు.
బీహార్‌లోని అరారియా జిల్లాలో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి రెండ్రోజుల ముందే కూలిపోయింది. బ్రిడ్జ్ కూలిపోవడం యొక్క షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వంతెన మొదట పూర్తిగా నీటిలో మునిగిపోయే ముందు పాక్షికంగా కూలిపోయింది.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 65 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఐటీఐ)లను అత్యాధునిక శిక్షణా సంస్థలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ప్రశాంతంగా ఉన్న ఒడిషాలో మత ఘర్షణలు చెలరేగాయి. స్థానికంగా వచ్చే నీరు కాస్తా ఎర్రగా మారడంతో బక్రీద్ సందర్భంగా గో హత్య జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. సచివాలయంలోని తన ఛాంబర్లో చంద్రబాబు నాయుడు పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికారు.
గాంధీ కుటుంబం నుంచి మరొకిరు రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ దక్షిణాదిన వాయనాడ్ నుంచి అటు ఉత్తరాది రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి రెండు చోట్ల భారీ మెజారిటీ గెలుపొందారు
నీట్ పరీక్షల వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా సహించమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నాడు కేంద్రప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు పంపించింది.
కట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపించిన ఘటన హర్యానాలోని పానిపట్‌లో జరిగింది. ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఇలాంటి సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. లోకసభ కొత్త స్పీకర్ ఎంపిక కోసం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో మంత్రులు మంగళవారం సాయంత్రం సమావేశమై ఓ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.