Home / తప్పక చదవాలి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ బుధవారం సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ (పీఈ)ని నమోదు చేసింది. అక్టోబర్ 3లోగా అన్ని పత్రాలను అందజేయాలని ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను సీబీఐ ఆదేశించింది.
మణిపూర్ ప్రభుత్వం బుధవారం నాడు రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) అక్టోబర్ 1 నుండి 6 నెలల పాటు పొడిగించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, లోయలోని 19 పోలీసు స్టేషన్లు మినహాయించబడ్డాయి.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ సైన్స్ సిటీలో రోబో ఎగ్జిబిషన్‌ను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఎగ్జిబిషన్‌లోని వివిధ రోబోట్ స్టాల్స్‌లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి అనేక రోబోలను గమనిస్తున్నప్పుడు ప్రధాన మంత్రి X లో ఒక ఆసక్తికరమైన వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసారు.
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనం దీనిని మరో బెంచ్ వద్దకు బదిలీ చేసింది. ధర్మాసనం లోని జడ్జి ఎస్వీ భట్టి ఈ కేసు విచారణకు విముఖత చూపారు.
అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో తనకి ముందస్తు బెయిలివ్వాలంటూ టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి అనుచిత లబ్ధి పొందారని సిఐడి అధికారులు నారా లోకేష్‌ని కూడా నిందితుడిగా చేర్చారు.
ఇరాక్‌లోని ఒక ఫంక్షన్ హాల్లో వివాహం సందర్బంగా జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మరణించగా 150 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి చంద్రబాబు అన్నారని ఇప్పుడు బెయిల్‌కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవని ప్రకటించిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారు.
అజర్‌బైజాన్‌లోని నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంలోని గ్యాస్ స్టేషన్లో జరిగిన పేలుడులో 20 మంది మరణించగా 300 మందిగాయపడ్డారు. వేర్పాటువాద అధికారులు ఈ ప్రాంతం యొక్క అధికారాన్ని అజర్‌బైజాన్‌కు అప్పగించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇది జరిగింది. గాయపడిన వారిలో పలువురి పరిస్దితి ఇంకా విషమంగానే ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.
చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ రెండు పార్టీల సమస్య అన్నారు. హైదరాబాద్‌లో ఆందోళనలకు అనుమతి ఎందుకు ఇవ్వట్లేదని లోకేష్ ఫోన్ చేశారని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు తెలంగాణకు ఏం సంబంధమని ప్రశ్నించారు.
: 41 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ ఈక్వెస్ట్రియన్‌లో బంగారు పతకం సాధించింది.సుదీప్తి హజెలా (చిన్స్కీ - గుర్రం పేరు), హృదయ్ విపుల్ ఛేడా (కెమ్‌క్స్‌ప్రో ఎమరాల్డ్), అనుష్ అగర్వాలా (ఎట్రో), మరియు దివ్యకృతి సింగ్ (అడ్రినాలిన్ ఫిర్‌ఫోడ్)లతో కూడిన భారత బృందం ఈక్వెస్ట్రియన్‌లో డ్రస్సేజ్ ఈవెంట్లో భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.