Home / తప్పక చదవాలి
ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై హోంమంత్రి అమిత్ షాకు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సిఐడి చీఫ్ సంజయ్ సర్వీస్ రూల్స్ అన్నీ ఉల్లంఘించారంటూ ఆధారాలు సమర్పించారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి సిఐడి చీఫ్ సంజయ్ వైసీపీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వరద నష్టాలకు పరిహారం మరియు కనీస మద్దతు ధర (MSP) డిమాండ్ చేస్తూ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేతృత్వంలో రైతు సంఘాలు గురువారం నుంచి మూడు రోజులు పాటు రైల్ రోకోకు పిలుపునిచ్చాయి
:భారత్ లోని యూఎస్ ఎంబసీ గురువారం వరకు రికార్డు సంఖ్యలో ఒక మిలియన్ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది. మహమ్మారికి ముందు 2019 కంటే దాదాపు 20% ఎక్కువ దరఖాస్తులను ప్రాసెస్ చేసింది.
పాకిస్థాన్ భారత్ కు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని తెలిసిన విషయమే. అదేవిధంగా పాక్ చైనాకు గాడిదలను ఎగుమతి చేస్తుంది. ఇపుడు తాజాగా పాకిస్తాన్ ఎగుమతుల జాబితాలో బిచ్చగాళ్లు చేరారు. అవును.. సౌదీ అరేబియా మరియు ఇరాక్ వంటి దేశాలు ఇప్పుడు బిచ్చగాళ్ల ప్రవాహాన్ని అరికట్టాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మరియు భారతదేశంలో హరిత విప్లవానికి ప్రధాన రూపశిల్పి అయిన ఎంఎస్ స్వామినాథన్ నేటి ఉదయం 11:20 గంటలకు చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. స్వామినాథన్ కు భార్య మీనా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
మణిపూర్‌లో ఇద్దరు విద్యార్దుల మృతిపై హింసాత్మక నిరసనలు చెలరేగాయి. గురువారం తెల్లవారుజామున, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రదర్శనలలో భాగంగా ఇంఫాల్ వెస్ట్‌లో ఒక గుంపు రెండు నాలుగు చక్రాల వాహనాలను తగులబెట్టింది . అంతేకాదు డిప్యూటీ కమీషనర్ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది.
ఢిల్లీలో తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేయడానికి క్రీడాకారులను స్టేడియం నుంచి పంపించి వార్తల్లో నిలిచిన ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గాను ప్రభుత్వం బలవంతంగా పదవీ విరమణ చేసినట్లు బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆమెను ప్రభుత్వం తప్పనిసరి పదవీ విరమణ చేసింది.
భారత్ -కెనడాల మధ్య దౌత్య చిచ్చు పెట్టిన ఖలిస్థానీ అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్ సానుభూతిపరులు-గ్యాంగ్స్టర్ల మధ్య ఉన్న బంధాన్ని వెలికితీసే పనిలోపడింది ఎన్ఐఏ. దీనిలో భాగంగా ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో సోమవారం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన జరిగింది. 12 ఏళ్ల బాలిక పాక్షిక అర్దనగ్నంగా రక్తస్రావంతో ఇంటింటికి తిరిగి సహాయం కోసం వేడుకుంటే ఒక్కరు కూడా కనికిరించలేదు. సహాయం కోసం ఒక వ్యక్తిని అభ్యర్దిస్తే అతడు తరిమికొట్టాడు.
పంజాబ్‌లోని మోగాకు చెందిన ఒక 40 ఏళ్ల వ్యక్తి కి ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్ అయ్యారు. ఎందుకంటే అతని కడుపులోనుంచి తీసిన వస్తువుల జాబితాలో ఇయర్ఫోన్లు, లాకెట్లు, స్క్రూలు, రాఖీలు వంటి వస్తువులు ఉన్నాయి. మానసికంగా అస్వస్థతకు గురయిన ఈ వ్యక్తి తీవ్రమైన దీర్ఘకాలిక కడుపునొప్పితో వైద్యులను సంప్రదించడం జరిగింది.