Last Updated:

Nagorno-Karabakh: నగోర్నో-కరాబాఖ్‌లో గ్యాస్ స్టేషన్ పేలుడు.. 20 మంది మృతి.. 300 మందికి గాయాలు..

అజర్‌బైజాన్‌లోని నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంలోని గ్యాస్ స్టేషన్లో జరిగిన పేలుడులో 20 మంది మరణించగా 300 మందిగాయపడ్డారు. వేర్పాటువాద అధికారులు ఈ ప్రాంతం యొక్క అధికారాన్ని అజర్‌బైజాన్‌కు అప్పగించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇది జరిగింది. గాయపడిన వారిలో పలువురి పరిస్దితి ఇంకా విషమంగానే ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.

Nagorno-Karabakh: నగోర్నో-కరాబాఖ్‌లో  గ్యాస్ స్టేషన్ పేలుడు..  20 మంది మృతి.. 300 మందికి గాయాలు..

Nagorno-Karabakh: అజర్‌బైజాన్‌లోని నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంలోని గ్యాస్ స్టేషన్లో జరిగిన పేలుడులో 20 మంది మరణించగా 300 మందిగాయపడ్డారు. వేర్పాటువాద అధికారులు ఈ ప్రాంతం యొక్క అధికారాన్ని అజర్‌బైజాన్‌కు అప్పగించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇది జరిగింది. గాయపడిన వారిలో పలువురి పరిస్దితి ఇంకా విషమంగానే ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.

ఆర్మేనియాకు వలసలు..(Nagorno-Karabakh)

అర్మేనియాకు పారిపోవాలని కోరుతున్న ప్రజలు ఇంధనం కోసం బారులు తీరడంతో గ్యాస్ స్టేషన్‌లో పేలుడు సంభవించింది.మూడు దశాబ్దాల వేర్పాటువాద పాలనను అనుసరించి అజర్‌బైజాన్ సైన్యం ఈ ప్రాంతాన్ని పూర్తిగా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వేగవంతమైన ఆపరేషన్‌ను ప్రారంభించిన తర్వాత వేలాది మంది నగోర్నో-కరాబాఖ్ నివాసితులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆర్మేనియాకు పారిపోతున్నారు. అజర్‌బైజాన్ ఈ ప్రాంతంలోని జాతి అర్మేనియన్ల హక్కులను గౌరవిస్తామని,సరఫరాలను తిరిగి పునరుద్దరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అనేక మంది స్థానికులు ప్రతీకార చర్యలకు భయపడి అర్మేనియాకు పారిపోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సాయంత్రం వరకు 6,500 మంది నగోర్నో-కరాబాఖ్ నివాసితులు ఆర్మేనియాలోకి ప్రవేశించారు. నాగోర్నో-కరాబాఖ్‌లోని రష్యా శాంతి పరిరక్షకులు తరలింపునకు సహకరిస్తున్నారని మాస్కో తెలిపింది. సోమవారం రాత్రికి దాదాపు 700 మంది శాంతి భద్రతల శిబిరంలో ఉన్నారు.