Home / తప్పక చదవాలి
గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్, చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. పీవోపీ విగ్రహాలు కుంటల్లో నిమజ్జనం చేయాలని తెలిపింది. హైకోర్టు హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది హై కోర్టు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిన మరో ఇద్దరిని తిరస్కరించారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తమిళిసై అంగీకరించలేదు.
ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం. ఈ రోజు ఉదయం షూటింగ్ విభాగంలో భారత్ కు మొదటి బంగారు పతకం వచ్చింది. దీనితో ఆసియాక్రీడల్లో భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 9 కు చేరింది.
ముఖ్యమంత్రి కేసిఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తాంత్రిక పూజల్లో సిద్ధహస్తుడని, ఇతర పార్టీల నేతలనే కాకుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కావాలని కోరుకుంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆసియా క్రీడల్లో భారతదేశపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించింది.భారత షూటర్లు దివ్యాన్ష్ పన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ మరియు రుద్రంక్ష్ పాటిల్ ఆభారత్కు తొలి బంగారు పతకాన్ని అందించారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటికి కాంగ్రెస్ సీనియర్ నేతలు చేరుకున్నారు. మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరిక, ఇతర అంశాలపై ఆయనతో సీనియర్లు చర్చించనున్నారు. ఇప్పటికే మైనంపల్లి ఇంటికి దామోదర రాజనర్సింహ, అంజన్ కుమార్ యాదవ్, మల్కాజ్ గిరి డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ చేరుకున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ని హైకోర్టు కొట్టేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నెల 28నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకూ సుప్రీంకోర్టుకి సెలవులున్నాయి. విచారణ వాయిదా పడినా లేదా ఆలస్యం అయినా చంద్రబాబు కేసు అక్టోబర్ 3 తరువాతే తేలే అవకాశాలుంటాయి.
పవన్‌ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతీసి కొడతానని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అవినీతిపరులు, అక్రమార్కులకు జనసేనలో సీట్లు ఇవ్వమన్నారు. ప్రజా సేవకులకే ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని స్పష్టం చేసారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు రిమాండుని అక్టోబర్ 5 వరకూ విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. నేటితో సిఐడి రెండు రోజుల కస్టడీ ముగిసింది. చంద్రబాబు విచారణకి సహకరించలేదని అంటున్న సిఐడి అధికారులు చంద్రబాబుని మరోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించాలని నిర్ణయించారు.
అయోధ్యలో వచ్చే జనవరిలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. అయితే రామమందిరం ప్రారంభానికి ముందే ఈ డిసెంబర్లో అయోధ్య కొత్త విమానాశ్రయం నుండి విమానాల రాకపోకలు ప్రారంభమయే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.