Home / తప్పక చదవాలి
విశాఖ ఇండస్ట్రీకు ఆరు వారాల్లోపు 17కోట్ల 50 లక్షలు చెల్లించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కి హైకోర్టు ఆదేశించింది. ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి 2004లో బ్యాంకు లోన్ తెచ్చి విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్షిప్ చేసింది. ఆ తరువాత హెచ్‌సీఏ - విశాఖ ఇండస్ట్రీస్ మధ్య స్పాన్సర్ షిప్ అగ్రిమెంట్‌ను హెచ్‌సీఏ క్యాన్సిల్ చేసింది.
ఐసీసీ వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. విమానాశ్రయం వెలుపల గుమిగూడిన అభిమానుల స్వాగతాన్ని చూసి పాక్ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. గ్రాండ్ రిసెప్షన్ తరువాత, పాకిస్తానీ ఆటగాళ్ళు తమ సోషల్ మీడియాలో అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, తమ పార్టీ I.N.D.I.A కూటమికి పూర్తిగా కట్టుబడి ఉందని, అయితే డ్రగ్స్‌తో వ్యవహరించే వారిని విడిచిపెట్టబోమని అన్నారు.డ్రగ్స్ కేసులో పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్టయిన తర్వాత కేజ్రీవాల్ ఈ విషయాన్ని స్పష్టం చేసారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఎంపి మేనకా గాంధీకి ను ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసును పంపింది. ఆవులను దాని గోశాలల నుండి కసాయిలకు విక్రయించే ఇస్కాన్ దేశంలో అతిపెద్ద మోసకారి అని మేనకా గాంధీ చెప్పిన రెండు రోజుల తర్వాత నోటీసు వచ్చింది.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఒక మసీదు సమీపంలో శుక్రవారం జరిగిన 'ఆత్మాహుతి దాడి'లో సుమారుగా 52 మంది మరణించగా 50 మంది గాయపడ్డారు. ఇలాఉండగా ఈ పేలుడుకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు.
తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ అనుకూల సంఘాలు, రైతు సంఘాలు శుక్రవారం 'కర్ణాటక బంద్'కు పిలుపునిచ్చాయి. ఈ సందర్బంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సంస్థలకు చెందిన 70 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు.
భారత అంతరిక్ష ఫరిశోధనా సంస్థ ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే ప్రయోగాలు విజయవంతమయ్యేలా ఆశీర్వదించాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ సందర్భంగా సోమేశ్వర్ మహాపూజ నిర్వహించిన ఆయన యజ్ఞంలోనూ పాల్గొన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుకి సంబంధించిన వాదనలు జరుగనున్నాయి. ఢిల్లీలో లాయర్లతో నారా లోకేష్ సంప్రదింపులు జరపాల్సి ఉంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని కీర్తినగర్‌లోని ఫర్నిచర్ మార్కెట్‌ను సందర్శించి కార్పెంటర్లు, కార్మికులతో ముచ్చటించారు. దీనికి సంబంఢించి కాంగ్రెస్ పంచుకున్న వీడియోలు మరియు చిత్రాలు రాహుల్ గాంధీ హస్తకళాకారులతో కలిసి పనిచేస్తున్నట్లు చూపిస్తున్నాయి.
భరత జాతి చైతన్యమూర్తి భగత్ సింగ్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భరత జాతిలో పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు షహీద్ భగత్ సింగ్‌ను ఆసేతు హిమాచలం గుండెల్లో పెట్టుకుందన్నారు. తెల్లవారి దాష్టీకాలను ఎదిరించిన ఆ వీరుని జయంతి సందర్భంగా సభక్తికంగా అంజలి ఘటిస్తున్నానని పవన్ తెలిపారు.