Last Updated:

kodali Nani Comments: జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా.?.. కొడాలి నాని

చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి చంద్రబాబు అన్నారని ఇప్పుడు బెయిల్‌కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవని ప్రకటించిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారు.

kodali Nani Comments:  జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా.?.. కొడాలి నాని

kodali Nani Comments: చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి చంద్రబాబు అన్నారని ఇప్పుడు బెయిల్‌కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవని ప్రకటించిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారు.

అది ఇల్లు కాదు.. జైలు..(kodali Nani Comments)

దమ్ముంటే కేసులు పెట్టి అరెస్టు చేయమన్నారుగా.? మరి ఇపుడు ఎందుకు ఏడుస్తున్నారని నాని ప్రశ్నించారు. ఓ పక్కన అన్నయ్యను.. మరో పక్క మామయ్యను పెట్టుకుని..ఏదో చేద్దామని లోకేష్ అనుకుంటున్నారు. తన భర్తకు జైల్లో వసతులు లేవని భువనేశ్వరి అంటున్నారు. ఏసీలు, ఫ్రిజ్ లు, కూలర్లు ఉండటానికి అది ఇల్లు కాదు.. జైలు. జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా.? జైల్లో వసతులు కావాలంటే కోర్టును అడగాలని అన్నారు.

పక్క రాష్ట్రాల వారిని బ్రతిమాలుతున్నారు..

చంద్రబాబుకోసం ఎవరూ పాదయాత్రలు చేయరని కారు యాత్రలే చేస్తారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కోసం యాత్రలు చేసేది కమ్మవాళ్ళు మాత్రమే. ఎందుకంటే మావాళ్లకే కార్లు ఎక్కువగా ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల పార్టీని కమ్మవారి పార్టీగా మార్చారు. అధికారంలో ఉన్నపుడు నామినేటెడ్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వలేదని అన్నారు.బాబు అరెస్టును ఖండించండి అని పక్క రాష్ట్రాల వారిని బ్రతిమాలుతుంటే వారు ట్వీట్లు పెడుతున్నారని నాని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంత కాలం తమకు తిరుగు లేదని నాని చెప్పారు.