Home / తప్పక చదవాలి
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మరోసారి మండిపడ్డారు. అంగళ్లులో పోలీసులపై దాడులు చేయించారని ఫైర్ అయ్యారు. పుంగనూరులో 40 మంది పోలీసులకు గాయాలయ్యేలా చేశారని.. ఓ కానిస్టేబుల్‌కి కన్ను కూడా పోయిందని నిప్పులు చెరిగారు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేబట్టబోతుందనే విషయంపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామజోగయ్య సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి వేణుగోపాల కృష్ణ ఈ ప్రకటన చేయడం పట్ల కాపు సంక్షేమ సేన స్వాగతించిందని జోగయ్య తెలిపారు.
:భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్ యాన్ ’ లో కీలక సన్నాహక పరీక్ష టీవీ డీ1 పరీక్షను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది. క్రూ మాడ్యుల్ ప్రయోగంలో భాగంగా సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ ను నింగిలోకి పంపింది.
వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు సాయం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ఈ పథకం లబ్దిదారులకు సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు
ఇజ్రాయెల్ పౌరులపై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు దొరికిన వారిని దొరికనట్లు కాల్చి చంపే సమయంలో ఒక మహిళ సమయస్పూర్తితో తాను, తన భర్త ప్రాణాలను కాపాడుకున్న వైనం ఇపుడు సంచలనంగా మారింది
ఇజ్రాయెల్ పోలీసు బలగాలకు భారతదేశం యొక్క దక్షిణాది రాష్ట్రమైన కేరళతో ముఖ్యమైన సంబంధం ఉంది. కేరళలోని కన్నూర్‌లో ఉన్న ఒక దుస్తుల తయారీ సంస్థ, మరియన్ అపారెల్ ప్రైవేట్ లిమిటెడ్, 2015 నుండి ఇజ్రాయెల్ పోలీసుల కోసం ఏడాదికి సుమారు లక్ష యూనిట్ల యూనిఫామ్‌లను సరఫరా చేస్తోంది.
ఆన్లైన్ గేమ్ డ్రీమ్11లో రూ. 1.5 కోట్లు గెలుచుకుని మిలియనీర్‌గా మారిన పూణే పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ను అధికారులు సస్పెండ్ చేశారు. పూణెలోని పింప్రి-చించ్వాడ్ పోలీసులు అతనిపై దుష్ప్రవర్తన మరియు పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చారనే ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణం చెంది మూడు సంవత్సరాలు గడిచాయి, ఇంకా ఈ కేసు మిస్టరీ వీడలేదు. తాజాగా, శివసేన (యుబిటి) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే దీనికి సంబంధించి తనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఒక న్యాయవాది దాఖలు చేసిన పిల్లో జోక్యం చేసుకోవాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
ఉత్తరప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో ఇప్పటివరకు 24 మరణాలు నమోదయ్యాయి. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల డేటాను కలుపుకుంటే మరణాల సంఖ్య పెరుగుతుంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకి విజయవాడ ఏసీబీ కోర్టు షాకిచ్చింది. నవంబర్ ఒకటో తేదీ వరకూ చంద్రబాబు రిమాండుని ఎసిబి కోర్టు పొడిగించింది. నేటితో చంద్రబాబు రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా ఎసిబి కోర్టులో హాజరయ్యారు.