Home / తప్పక చదవాలి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశం చేస్తోంది రావణాసుర దహనం.., మనం చేద్దాం జగనాసుర దహనం చేద్దామని నారా లోకేష్ పిలుపునిచ్చారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే, దివంగత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఓ ఇంటి వాడయ్యారు. ఆదివారం రాత్రి నరసాపురానికి చెందిన జక్కం పుష్పవల్లిని వివాహం చేసుకున్నారు.విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో జరిగిన ఈ వివాహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.
రాజమండ్రిలో రేపు జనసేన టీడీపీసమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. తొలి సమావేశ వేదిక మంజీరా హోటల్లో ఏర్పాట్లను ఉమ్మడి తూ.గో. జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్, టీడీపి నేత ఆదిరెడ్డి వాసు , జనసేన రాజమండ్రి ఇంఛార్జి అత్తి సత్యనారాయణ పరిశీలించారు. ఈరోజు సాయంత్రానికి రాజమండ్రి టీడీపీ క్యాంపు కార్యాలయానికి నారా లోకేష్ చేరుకోనున్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మించిన నాయకుడు భారత దేశంలో లేరని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గుంటూరులో విలేఖరులతో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. కేంద్రంలో తాము చక్రాలు తిప్పలేదని, రాష్ట్రపతిని నియమించలేదని అన్నారు.
ఇంధన సరఫరా నిలిచిపోవడంతో యుద్ధంలో దెబ్బతిన్న గాజా ఆసుపత్రులలోని ఇంక్యుబేటర్లలో 120 నవజాత శిశువుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని యునైటెడ్ నేషన్స్ పిల్లల ఏజెన్సీ ఆదివారం హెచ్చరించింది. ఇంధనం లేకపోవడం వల్ల ఈ శిశువులు చనిపోయే ప్రమాదం ఉందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాను జైలులో లేనని., ప్రజల హృదయాల్లో ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి ప్రజలకు లేఖ రాశారు. విధ్వంస పాలనను అంతం చేయాలనే సంకల్పంలో ఉన్నానని తెలిపారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితం గురించి జైలు గోడల మధ్య ఆలోచించానని అన్నారు.
దేశవ్యాప్తంగా నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ (సిఆర్ పార్క్)లో ఉన్న దుర్గాపూజ మండపాన్ని సందర్శించారు. అక్కడ నిర్వాహకులు ఆయనకు బెంగాలీ సంప్రదాయంలో స్వాగతం పలికారు. మండపంలో నిర్వహించిన పూజ వేడుకల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
గాజా సరిహద్దు సమీపంలో శనివారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో హమాస్‌కు చెందిన నుఖ్బా కమాండో దళాలకు చెందిన ఇద్దరు సభ్యులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడిఎఫ్)తెలిపింది. అదే ఘటనలో ఇతర హమాస్ ఉగ్రవాదులు కూడా మరణించారని పేర్కొంది.
హమాస్ - ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న పాలస్తీనాకు భారతదేశం ఆదివారం మానవతా సాయం పంపింది. దాదాపు 6.5 టన్నుల వైద్య సహాయం మరియు 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రిని పాలస్తీనాకు పంపారు. ఇవి ఈజిప్టు మీదుగా పాలస్లీనాకు చేరుకుంటాయి.
మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించింది. శాంతి భద్రతలు మరియు హింసకు అవకాశం ఉన్నందున ఇంటర్నెట్ నిషేధాన్ని అక్టోబర్ 26 వరకు పొడిగిస్తూ రాష్ట్ర పోలీసులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.