Home / తప్పక చదవాలి
తెలంగాణ శాసన సభ ఎన్నికలలో జనసేన పోటీ చేయవలసిందేనని జనసేన తెలంగాణ నాయకులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో మంగళవారం రాత్రి జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.
సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే దాడిని తాము చేయలేదని ఇజ్రాయిల్ చెబుతోంది. ఆస్పత్రిపై దాడి చేసింది తమ బలగాలేనా కాదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో కన్నులపండువగా సాగింది. పుష్ప సినిమాకిగానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమనటుడి అవార్డుని అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డుని అందజేశారు.
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో పోలీసులు చేసిన దాడుల్లో రూ. 100 కోట్లకు పైగా విలువైన మెఫెడ్రోన్ పట్టుబడింది. రాహుల్ కిసాన్ గవాలీ మరియు అతని సోదరుడు అతుల్ చించోలిలో నడుపుతున్న డ్రగ్ తయారీ యూనిట్లో హైక్వాలిటీ మెఫ్డ్రోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని బాణాసంచా కర్మాగారాల్లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. వీరందరూ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులుగా పోలీసులు భావిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు అధికారులు పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందిని రంగంలోకి దించారు.
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా చర్చించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు అంశాలపై సమీక్షించి చర్చించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం కాంగ్రెస్ బస్సు యాత్ర రేపటినుంచి ప్రారంభం కానుంది. ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రని లాంఛనంగా ప్రారంభిస్తారు.రేపు సాయంత్రం 4 గంటలకు రామప్ప దేవాలయాన్ని రాహుల్, ప్రియాంక దర్శించుకుంటారు. ఆరు గ్యారంటీలను శివుడి ముందు పెట్టి పూజలు చేస్తారు
గాజాలో ఇజ్రాయెల్ నేరాలు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను, ప్రతిఘటన శక్తులను ఎవరూ ఆపలేరని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మంగళవారం అన్నారు. గాజాపై బాంబు దాడి తక్షణమే నిలిపివేయాలని ఖమేనీ డిమాండ్ చేసారు.
గాజా స్ట్రిప్ ప్రాంగణంలో ఐక్యరాజ్యసమితి కార్యాలయాల నుండి శరణార్థుల కోసం ఉద్దేశించిన ఇంధనం మరియు వైద్య సామాగ్రిని హమాస్ దొంగిలించిందని యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ ఇన్ ది నియర్ ఈస్ట్ (UNRWA) తెలిపింది.
పలువురు ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసిన హమాస్ తమ అధీనంలో ఉన్న ఒక యువతి వీడియోను విడుదల చేసింది. అందులో ఒక యువతి గుర్తు తెలియని ప్రదేశంలో వైద్య చికిత్స పొందుతున్నట్లు చూపించారు. సదరు యువతి తనను తాను షోహమ్కు చెందిన మియా షెమ్ అని పరిచయం చేసుకుంది.