Home / తప్పక చదవాలి
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి పాల్పడితే మోదీ అండగా నిలబడ్డారని చెప్పారు. ఆదివారం ఆందోల్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో టన్నెల్ నుంచి 41మంది కూలీలను బయటకు తీసే రెస్క్యూ ఆపరేషన్‌లో భారత సైన్యం కూడా రంగంలోకి దిగింది.టన్నెల్ ముందు నుంచి అగర్ మెషిన్ ద్వారా చేస్తున్న డ్రిల్లింగ్ పనులు పూర్తి కాకముందే మెషిన్ బ్లేడ్లు ముక్కలుముక్కలుగా విరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను నిపుణులు అన్వేషిస్తున్నారు.
: పాకిస్తాన్‌లోని కరాచీలో రషీద్ మిన్హాస్ రోడ్‌లోని బహుళ అంతస్తుల షాపింగ్ మాల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 11 మంది మరణించగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు, జియో న్యూస్ నివేదించింది. కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో మరణించిన వారి సంఖ్యను ధృవీకరించారు. భవనంలో వ్యక్తుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.
సోమాలియాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో మరణించిన వారి సంఖ్య 96కి చేరుకుందని రాష్ట్ర వార్తా సంస్థ సోన్నా శనివారం తెలిపింది. సోమాలియా వరద మృతుల సంఖ్య 96కి చేరుకుందని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో ఒక పోస్ట్‌లో తెలిపారు,ఈ సంఖ్యను ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి మహముద్ మోఅల్లిమ్ ధృవీకరించారు.
నేను ఎప్పుడూ మిమల్ని ఓటు బ్యాంకుగా చూడలేదు. మీ కష్టాల్లో నేను ఉన్నాను. మీకు అండగా నిలబడతాను అంటూ విశాఖ మత్స్యకారులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదంలో బోట్లు కాలిపోయి, నష్టపోయిన మత్స్యకారులకు ఆయన ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ వారిని ఉద్దేశించి ప్రసంగింమచారు.
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధానికి కాస్తా విరామం లభించింది. ఖతార్ మధ్యవర్తిత్వం అమల్లోకి వచ్చింది. వాస్తవానికి గురువారం నుంచి కాల్పుల విమరణ అమలు కావాల్సి ఉండగా.. కొన్ని సాంకేతిక పరమైన అంశాల వల్ల శుక్రవారానికి వాయిదా పడింది. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది.
తెలంగాణలో అమరుల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయో ఆలోచించి ఓటు వేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు.
ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇవాళ హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించారు. HICC లో రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం రాయదుర్గంనుంచి బేగంపేట వరకు మెట్రోలో ప్రయాణించారు.
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ 9 ఎన్ 2 వైరస్ వ్యాప్తి, చిన్న పిల్లల్లో కనిపిస్తున్న శ్వాసకోశ సమస్యల వల్ల మన దేశంలో పిల్లలకి ఎలాంటి ఇబ్బందీ ఉండదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఒక అడ్వైజరీ నోట్ విడుదల చేసింది.
భారత పేస్ బౌలర్ నవదీప్ సైనీ తన స్నేహితురాలు స్వాతి అస్థానాను వివాహం చేసుకున్నాడు. అతని వివాహ చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా స్వాతిని సైనీ పెళ్లి చేసుకున్నాడు.