SRH Vs RR : ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్… బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్న పలువురి అరెస్టు

SRH Vs RR : సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు.
ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు..
ఎస్ఆర్‌హెచ్, ఆర్‌ఆర్ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం వద్ద హైదరాబాద్ క్రికెట్ సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు 2,700 మంది సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. స్టేడియంలో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మహిళా ప్రేక్షకుల కోసం మహిళా భద్రత విభాగం బృందాలు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియానికి వచ్చే వారి కోసం ఐదు చోట్ల ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలోకి వివిధ రకాల వస్తువులను నిషేధించారు. అగ్గిపెట్టె, వాటర్ బాటిళ్లు, గొడుగులు, ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించారు.