Home / తెలంగాణ
ED Accepts KTR Request in Formula E-Car Race Case: ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ ముందు హాజరయ్యేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమయం కోరారు. ఈ మేరకు ఈడీ కూడా గడువు ఇచ్చేందుకు అంగీకరించింది. తదుపరి ఎప్పుడు హాజరుకావాలో ఈడీ వెల్లడించనుంది. అయితే ఈ కేసులో ఇవాళ ఈడీ ముందు కేటీఆర్ హాజరుకావాల్సి ఉంది. అయితే, ఈ కార్ […]
South Central Railway to operate Special Trains For Sankranthi: సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా తమ సొంతింటికి వెళ్తుంటారు. ఈ మేరకు ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగకు రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని […]
PM Modi to Virtually Unveil Telangana’s New Cherlapally Railway Station: చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను పీఎం నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.413 కోట్ల వ్యయంతో ఎయిర్ పోర్టు తరహాలో ఆధునిక మౌలిక సదుపాయాలతో ఈ టర్నినల్ నిర్మించారు. 9 ప్లాట్ ఫామ్‌లు, 6 లిప్ట్‌లు, 7 ఎస్కలేటర్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, బుకింగ్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. మొత్తం 50 రైళ్లు నిడిచేలా 19 […]
KTR objected to not giving entry to lawyers at ACB office in Formula-E race case: హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణ మేరకు ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ వద్దకు న్యాయవాదులతో కలిసి వచ్చారు. కేటీఆర్ వెంట లాయర్లకు అనుమతి లేదని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అయితే తన న్యాయవాదిని ఏసీబీ కార్యాలయంలోకి […]
Telangana Government Big Alert to HMPV Virus Spread in China: చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. కోవిడ్ 19 మాదిరిగానే హ్యుమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన చాలామంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్లూ లక్షణాలు ఉంటే మాస్కులు తప్పనిసరిగా […]
Telangana Cabinet Key Decisions: హైదరాబాద్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. రైతు భరోసా విధివిధానాలపై చర్చ జరుగుతోంది. ఈ విధి విధానాలపై కేబినెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. భూమిలేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డులపై చర్చించారు. ఈ మేరకు సంక్రాంతికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కానుంది. అలాగే 11 కొత్త మండలాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం […]
AP CM Chandrababu speech in World Telugu Federation Conference: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటుమహాసభలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీమతి ఇందిరా దత్, కృష్ణ ఎల్ల, మాజీ ఎంపీ మురళీమోహన్, నెల్లూరు […]
Telangana government Declared January 3 as Women Teachers’ Day: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏటా జనవరి 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ‘మహిళా టీచర్స్ డే’గా నిర్వహించనున్నట్లు పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించాలని […]
BJP MLA Alleti Maheshwar Reddy Shocking Comments On Congress Ministers: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేకపోయిందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల నిరుడంతా ఎగవేతల నామ సంవత్సరంగా ముగిసిందని, కనీసం ఈ కొత్త సంవత్సరంలోనూనా హామీలను గుర్తు తెచ్చుకుని అమలు చేయాలని సూచించారు. త్వరలో ఆధారాలతో […]
Formula-E race case Update: ఫార్ములా-ఈ కార్ కేసులో ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. కాగా, గురువారం ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. కానీ విచారణకు సమయం కోరుతూ ఈడీకి లేఖ రాశారు. అదే విధంగా ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు సైతం బీఎల్ఎన్ రెడ్డి మెయిల్ చేశారు. ఇదిలా ఉండగా, తర్వాత విచారణ ఎప్పుడు అనేది చెబుతామంటూ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ సమాధానం ఇచ్చింది. ఫార్ములా-ఈ కార్ […]