Home / తెలంగాణ
Badrachalam: రామయ్య సంబురాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. జానకిరాముల వివాహ వేడుకను వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. అశేష భక్తజనం మధ్య.. రఘురాముడికి పట్టాభిషేకం జరపనున్నారు.
MLA Durgam Chinnayya: బీఆర్ఎస్ నేత.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. తమను నమ్మించి మోసం చేశారని.. మహిళ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో మంచిర్యాలలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.
KTR: హైదరాబాద్ అభివృద్ధిపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో హైదరాబాద్ రోజురోజుకి విస్తరిస్తోందని.. అయినా కేంద్రం సహకరించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లిలో చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
YS Sharmila: హైదరాబాద్ లోని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంటివద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల కిందపడిపోయారు.
MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు అందింది. నేడు ఈడీ కార్యాలయానికి రావాలని.. లేఖ ద్వారా తెలిపింది.
మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఆదరణ లభిస్తుంది. ఇక దేశానికే గర్వకారణంగా అభివృద్ది చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతుంది. రియల్ ఎస్టేట్ లోనే అత్యధికంగా ల్యాండ్ బ్యాంకు ఉన్న సంస్థ లావోరా. దాదాపు ఇరవైకి పైగా ప్రాజెక్టులతో సుమారు రెండు వేల ఐదోందల ఎకరాలను లావోరా సంస్థ
సీనియర్ పొలిటీషియన్ డి.శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిన్న కాంగ్రెస్లో చేరిన డీఎస్ నేడు రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు లేఖ రాశారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగాణ గ్రామాలు దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా మారాయని రాష్ట్ర పురపాలక శాక మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోని పలు ఓయో రూమ్లపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. కేపీహెచ్ బీ కాలనీలోని పలు ఓయో రూమ్ లపై పోలీసులు దాడులు నిర్వహించారు.
MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ సమన్లు పంపడాన్ని సవాల్ చేస్తూ.. ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేయనుంది.