Home / తెలంగాణ
భారత దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసులో నిందితుడు భరద్వాజ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. 24 రాష్ట్రాలకి చెందిన 8 మెట్రోపాలిటన్ సిటీలకి చెందిన డేటా విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 66 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని భరద్వాజ్ ముఠా విక్రయించినట్లు గుర్తించారు.
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాం చోటుచేసుకుంది. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని.. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని కోరారని తెలుస్తుంది.
తెలంగాణలో ప్రతిపక్షాలు ఏకమయ్యే దిశగా పయనిస్తున్నాయి. నిరుద్యోగుల అంశం వేదికగా వైఎస్సార్టీపీ, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చొరవ తీసుకున్నారు.
హైదరాబాద్‌లో ఈడీ దాడులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పటాన్చెరు, మాదాపూర్‌లోని.. 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే.
hyderabad metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్ లపై రాయతీ కల్పించిన మెట్రో.. ఇక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనుంది.
YS Sharmila: ప్రశ్నపత్రాల లీకేజీపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీఎస్ పీఎస్సీ ముట్టడికి యత్నించిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
Pen Drive: ప్రశ్నపత్రాల లీకేజీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మెుత్తం ఇప్పటి వరకు 15 ప్రశ్నపత్రాలు లీకేజీ అయినట్లు సిట్ గుర్తించింది. నిందితుల పెన్ డ్రైవ్ లో 15 ప్రశ్నపత్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ లో నూతన కాపు భవనానికి ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాపు సంఘం వ్యవస్థాపక సభ్యులు తలారి గోవిందా రాజులు సమక్షంలో ఈ పూజ కార్యక్రమం నిర్వహించారు. అలానే ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ సీఈవో పైడికొండల వేంకటేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
: తెలంగాణలో ఎండలు మండిపోనున్నాయి. వచ్చే నాలుగు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవ్వనున్నట్టు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.
కల్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో భక్తజనం స్వాగతం పలికారు.