Home / ప్రాంతీయం
వికారాబాద్ జిల్లా లో కనీవినీ ఎరుగని రీతిలో వడగండ్ల వాన కురిసింది. ఎటు చూసినా వండగండ్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టుల మీద చోటు చేసుకుంటున్నాయి. అయితే, ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెయిన్ అలెర్ట్ వచ్చేసింది. ఉపరితల ఆవర్తనం బంగ్లాదేశ్, పొరుగు ప్రాంతాల నుండి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు పశ్చిమ బెంగాల్, ఒడిశా మీద సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవరించి ఉన్నట్లు సమాచారం అందుతుంది. అదే విధంగా ఉత్తర అంతర్గత తమిళనాడు నుంచి కొంకణ్ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు తీరప్రాంతం, అంతర్గత కర్ణాటక, గోవా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ఎత్తు వరకు విస్తరించి వుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఈ నెల 13న ఏపీ లోని 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఉదయం 8 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ లో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇది వరకే ఈ నెల 11న కవిత తొలి విచారణకు హాజరైన సందర్భంలో కూడా ఇలాంటి వాతావరణం లేదు.
ఏపీలో రాజకీయాలు నువ్వానేనా అంటూ రోజురోజుకు సై అంటే సై అన్నట్టు ఉన్నాయి. అందులోనూ టీడీపీ వైసీపీ మధ్య అయితే మాటల తూటాలు పేలుతూనే ఉంటున్నోయి. అవికాస్త ముదిరితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయ్యింది. ఉదయం 8 గంటలకు నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఏపీలో మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలబడ్డారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెజ్ సమావేశాల్లో నేడు కీలకం ఘట్టం. ఈ ఏడాదికి 2023-24గాను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
నేనొక పిచ్చినా కొడుకును, జంతువును అని చెప్పుకుంటూ ఉండే వర్మ.. తాజాగా ఓ కాలేజీలోని విద్యార్థులకు సైతం ఇలాంటి పాఠాలే చెప్పుకొచ్చాడు. చదువుకొని బాగుపడాలి.. ఉన్నత స్థానంలో ఉండాలి అధిక డబ్బు సంపాధించాలి అనేవి తన దృష్టిలో వేస్ట్ అని చెప్పుకొవచ్చారు.
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు గూగులమ్మను నమ్ముకొని బతకటం ఇవాల్టి రోజుల్లో అలవాటుగా మారింది. కొత్త ప్లేస్ కు వెళ్లాలంటే.. గూగుల్ మ్యాప్ ను పెట్టుకొని వెళ్లటం అంతకంతకూ అలవాటుగా మారింది.