Home / ప్రాంతీయం
Road Accident In Palnadu District 4 Killed: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండంలోని బ్రాహ్మణపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి ఎదురుగా చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ […]
BRS Releases Charge Sheet on Congress One Year Rule: తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ అంటూ మొత్తం 18 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్‌ను ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను రోడ్డెక్కించిన ఘనత రేవంత్ ప్రభుత్వానికి దక్కిందని […]
BRS Working President KTR speaking at Telangana Bhavan: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచిన అన్నిరంగాల్లో వెనుకబడి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఏడాది పాలన ప్రజల దృష్ణికోణంలో ఓ విపత్తు అని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 420కి పైగా వాగ్ధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే […]
Deputy CM Pawan Kalyan Visits Kadapa: మహనీయుల నేలకు తానొచ్చానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం కడప మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. ఆటల విషయంలో బాయ్స్ కి ఎక్కువ సపోర్టర్ చేస్తున్నారని పవన్ కు ఓ బాలిక ఫిర్యాదు చేసింది. పిల్లల పట్ల అటువంటి వైరుధ్యం ఎందుకని పవన్ కల్యాణ్ ను […]
AP Deputy CM Pawan Kalyan IN Student and Parents at Mega Parents-Teachers Meet: ఏపీలో డ్రగ్స్ పరిస్థితి దారుణంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కడప మున్సిపల్లో పర్యటిస్తున్న ఆయన ఓ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్- టీచర్స్ మీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలను డ్రగ్స్ నుంచి దూరం చేయాలన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆస్ట్రేలియా […]
CM Chandrababu Interacts with Student and Parents at Mega Parents-Teachers Meet: విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్- టీచర్స్ మీట్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ మేరకు విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో డ్రగ్స్, గంజాయిపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. డ్రగ్స్, సెల్ ఫోన్ వంటి వ్యసనాలకు అలవాటు పడితే […]
Another earthquake hits Telangana at Mahaboobnagar: తెలంగాణలో మరోసారి భూకంపం సంభవించింది. మహబూబ్‌నగర్‌లో మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైంది. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండల పరిధిలోని దాసరిపల్లి కేంద్రంగా భూమి కంపించినట్లు గుర్తించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనతో పరుగులు […]
Mega Parent-Teacher Meet to be held in AP Govt Schools: ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో మెగా పేరెంట్-టీచర్ మీట్ జరుగుతోంది. పిల్లల చదువులపై అవగాహన కోసం ఈ సమావేశం ప్రభుత్వం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో ఉన్న సుమారు 40వేల స్కూళ్లలో పేరెంట్- టీచర్ మీట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు బాపట్లలో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం స్టూడెంట్స్, పేరెంట్స్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. బాపట్లలోని ఓ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ మంత్రి నారా […]
CM Revanth Reddy Tweet On One Year Of Congress Ruling: తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సరిగ్గా పదేళ్లు పట్టింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ మేరకు సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది ప్రజాపాలనలో చాలా సంతృప్తిగా […]
Accident At Pochampally: తెలంగాణలో ఘోర విషాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ దగ్గర ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆ వాహనం చెరువులో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి […]