Formula-E race case: ఫార్ములా-ఈ కార్ కేసు.. విచారణకు బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరు
Formula-E race case Update: ఫార్ములా-ఈ కార్ కేసులో ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. కాగా, గురువారం ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. కానీ విచారణకు సమయం కోరుతూ ఈడీకి లేఖ రాశారు. అదే విధంగా ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు సైతం బీఎల్ఎన్ రెడ్డి మెయిల్ చేశారు. ఇదిలా ఉండగా, తర్వాత విచారణ ఎప్పుడు అనేది చెబుతామంటూ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ సమాధానం ఇచ్చింది.
ఫార్ములా-ఈ కార్ కేసులో ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఇవాళ విచారణకు రాలేదు. అయితే బీఎల్ఎన్ రెడ్డి విచారణకు వచ్చింటే అతనను విచారించి.. రేపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను విచారించే అవకాశం ఉండేది. కానీ బీఎల్ఎన్ రెడ్డి విచారణకు రానందున రేపు అరవింద్ కుమార్ వస్తారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.
కాగా, ఈ కేసు విచారణకు హాజరయ్యే ముందు కచ్చితంగా గతంలో హెచ్ఎండీఏ మాజీ ఇంజనీర్‌గా పనిచేసినందునా.. దానికి సంబంధించిన డ్యాక్యుమెంట్స్, విదేశీ కరెన్సీ రూపంలో వెళ్లిన నగదుకు సంబంధించిన అకౌంట్ల వివరాలు తీసుకురావాలని ఇప్పటికే ఈడీ అధికారులు సూచించారు. ఒకవేళ ఇవాళ విచారణకు వచ్చింటే తన స్టేట్ మెంట్ రికార్డు చేసేవారు. అలాగే అరవింద్ కుమార్ స్టేట్ మెంట్ కూడా రికార్డు చేసేవారు. దీనిపై స్పష్టత రావాలంటే రేపటి వరకు ఆగాల్సి ఉంటుంది.
ఎందుకంటే, ఈ ఇద్దరి స్టేట్ మెంట్ ఆధారంగానే ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రశ్నించే అవకాశం ఉండేది. కానీ ఇవాళ బీఎల్ఎన్ రెడ్డి విచారణకు రాలేనందున రేపు అరవింద్ కుమార్, జనవరి 7వ తేదీన కేటీఆర్ మీద విచారణ సస్పెన్స్ నెలకొంది.