Home / ప్రాంతీయం
Burra Venkatesham took charge as the Chairman of TGPSC: రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలు పారదర్శంగా, వేగంగా చేపడుతామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గురువారం నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో బుర్రా చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కమిషన్ సభ్యులు, సిబ్బంది బుర్రాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై పూర్తి స్థాయిలో అభ్యర్థుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఐఏఎస్ […]
Sharmila Complaints against jagan to ACB: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అదానీ విద్యుత్ ఒప్పందంలో భాగంగా జరిగిన అవినీతి మీద విచారణ చేసి, నిందితులెవరో బయటపెట్టాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గురువారం అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. అదానీ సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆంధ్రలో అవినీతి జరిగితే అమెరికాలో బయట పడిందన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా చేతులు మారిన రూ.1750 […]
Pushpa 2 Not Released in Prasad Multiplex: హైదరాబాద్ థియేటర్ పేరు చెప్పమంటే అంతా ప్రసాద్ పల్టీప్లెక్స్ పేరే చెబుతారు. పెద్ద పెద్ద సినిమాలు ప్రీమియర్స్, బెన్ఫిట్ షోలు ఈ థియేటర్లోనే పడుతుంటారు. ఇక ఫస్ట్ షో అంటే ప్రసాద్ ఐమ్యాక్స్ అనే అంటారు. ఏ కొత్త సినిమా రిలీజ్ అయిన నగరవాసులు, రివ్యూవర్స్ అంతా ప్రసాద్ ఐమ్యాక్స్కే తరలివస్తారు. హైదరాబాద్‌లోని థియేటర్లు ఎన్ని ఉన్న ప్రసాద్ ఐమ్యాక్ ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద పెద్ద […]
Telangana Assembly Sessions To Start From December 9: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 9న ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. పలు కీలక చట్టాల ఆమోదానికి సర్కారు సిద్ధం ప్రతీరోజూ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయని […]
Harish Rao Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన నివాసం వద్దకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పాడి కౌశిక్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. అయితే బంజారాహిల్స్ పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే గురువారం ఉదయం కొండాపూర్‌లోని […]
Mega Parent-Teacher Meet to be held in AP Govt Schools: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ – టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. తల్లిదండ్రుల సహకారం, వారి భాగస్వామ్యంతో 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని విద్యా శాఖ […]
Google To Establish Google Safety Engineering Center in hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడులకు గూగుల్ సంస్థ సిద్ధమైంది. ఈ క్రమంలో బుధవారం తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ)ను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ తెలిపారు. ఈ మేరకు సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో గూగుల్ ప్రతినిధి బృందం.. సీఎం, ఐటీ మంత్రి శ్రీధర్ […]
AP Graduate MLC Elections: నేడు జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలోని మొత్తం 16,737 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో యూటీ ఎఫ్ తరపున గెలిచిన షేక్ సాబ్జి రోడ్డు ప్రమా దంలో మృతిచెందడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైందన్న సంగతి తెలిసిందే. అభ్యర్థులు […]
Transgenders as traffic volunteers in Hyderabad: ట్రాన్స్జెండర్లు ఇక నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కోరు.. కానీ సిగ్నల్స్ దగ్గర అతిత్వరలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ కనిపించబోతున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్లను కూడా వాలంటీర్లుగా నియమించనున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి పది రోజులపాటు ట్రాఫిక్ విధులపై శిక్షణ అందిస్తారు. వీరికి ప్రత్యేక యూనిఫాంతోపాటు ప్రతి నెల నిర్దేశిత స్టైపెండ్ ఇవ్వనున్నారు. తెలంగాణలో 3 […]
BJP NVSS Prabhakar Key Comments: రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ప్రజలకు మోసం చేయడంలో రేవంత్ కూడా చంద్రశేఖర్ బాటలోనే నడుస్తున్నాడని ఆరోపించారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆరు అబద్ధాలు.. 66 మోసాలపై బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చార్జిషీట్ పెట్టారన్నారు. దానిపై ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా చార్జిషీట్ పెడతామని […]