Home / ప్రాంతీయం
ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల పవన్ కళ్యాణ్ ధిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గద్దర్ మృతిపట్ల తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇది బాధాకరమైన రోజు అని.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా గద్దర్ పని చేశారని, యువతను ఉద్యమం వైపుకు ప్రేరేపించడంలో గద్దర్ పాత్ర ఉందన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో నేడు చివరి రోజు అని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ సమావేశాలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మరో 2 రోజులు పొడిగించింది.
ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గద్దర్.. ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. అయితే రెండు రోజుల క్రితం ఆయనకు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది.
గన్నవరం నియోజకవర్గం, మల్లవల్లి పారిశ్రామిక వాడ నిర్వాసిత రైతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు రైతులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీకోసం ప్రత్యక్ష ప్రసారం..
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో (ఆగస్టు 6) ముగియనున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు చివరివి. మరో మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. చివరి రోజైన ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం చేయనున్నారు. కాగా ఈ తరుణంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోరుకొండ మండలం బూరుగుపూడిలోని కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. మారేడుమిల్లి నుంచి ఏలూరు వెళ్తుండగా.. కల్వర్టు పైకి ఎక్కబోయి అదుపుతప్పి కారు కాలువలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
తెలంగాణ శాసన సభలో శనివారం పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ జరిగింది. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా తెలంగాణను అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. కట్టడం మాత్రమే తమకు తెలుసని.. ప్రతిపక్షాలకు కూలగొట్టడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.
మంగళగిరి జనసేన ఆఫీస్లో శనివారం గ్రామపంచాయతీల సర్పంచ్లు సమావేశమయ్యారు. పంచాయతీలను కాపాడుకుందామనే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో చర్చా గోష్టి నిర్వహించారు. 30 నెలలు దాటినా నిధులు రావడం లేదని సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు చెప్పారు. పూర్తయిన పనులకి బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదివరకు వైఎస్సార్ హయాంలో 2006-2008 మధ్య టీటీడీ ఛైర్మన్గా భూమన పని చేశారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా భూమన ఉన్నారు. ఈ నెల 8వ తేదీతో వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియనుంది. టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలను ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉందన్నారు.