Home / ప్రాంతీయం
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ బిఆర్ఎస్ పాలిటిక్స్ హీటెక్కాయి. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని సిఎం కెసిఆర్ ఖరారు చేశారు. పార్టీ టికెట్ లభించకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆరు నూరైనా ప్రజా జీవితంలోనే ఉంటానని రాజయ్య తాజాగా ప్రకటించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గిరిజన యువకుడు మృతి చెందగా, మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆస్పత్రి అధికారులు అంబులెన్స్ సౌకర్యం కల్పించకపోవడంతో కుటుంబ సభ్యులు మోటార్‌సైకిల్‌పై 27 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
తల్లి మీద ఉన్న ప్రేమతో ఓ కూతురు ఏకంగా చంద్ర మండలంపైనే ఎకరం భూమిని కొనుగోలు చేసింది. చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన తల్లిపై మమకారంతో చంద్రుడిపై స్థలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేయించి, మదర్స్ డే సందర్భంగా తల్లికి గిఫ్ట్ ఇచ్చింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న (ఆదివారం) తెలంగాణ పర్యటనకు రానున్నారు. అదే రోజు సాయంత్రం ఖమ్మం లో జరిగే బీజేపీ రైతు సభ లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్శిటీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న గిరిజనులకు సర్వదా రుణ పడి ఉంటానని అన్నారు. రూ.830 కోట్లతో నిర్మిస్తున్న యూనివర్శిటీకి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆలయ ప్రారంభోత్సవంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ కలిసి పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయాన్ని గవర్నర్‌తో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలానే ఈ కార్యక్రమంలో మంత్రులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఏపీలోని నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చెవిటి, మూగ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో సొంత మేనమామే కీచకుడిగా మారి ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగినప్పటికీ గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు పేర్కొంది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది. కృష్ణమోహన్ రెడ్డికి మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది.
తెలంగాణ మంత్రి వర్గంలోకి పట్నం మహేందర్ రెడ్డి చేరారు. గవర్నర్ తమిళి సై మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో సిఎం కెసిఆర్ సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు, గవర్నర్‌కు మంత్రి మహేందర్ రెడ్డి పుష్పగుచ్ఛాలు ఇచ్చారు.
ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి బుధవారం డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని కలిసారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.