Home / ప్రాంతీయం
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వాడివేడిగా మారాయి. ఈ క్రమం లోనే అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఈరోజు నుంచి రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించారు. ఈరోజు నుంచి నవంబర్ 9 వ
రాబోయే పదేళ్ళలో రాబోయే ప్రభుత్వం ఏ లక్ష్యాన్ని నిర్ధారించగలగాలో, ప్రజల అభీష్టమేమిటో అర్థం చేసుకుని పీపుల్స్ మేనిఫెస్టోని నవంబర్ 1వ తేదీకల్లా తయారు చేస్తామని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ప్రకటించారు.
తెలంగాణలో ఎన్నికల సమాయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు బంధుపై నిఘా ఉంచాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. 2018లో పోలింగ్ రోజు రైతు బంధు పంచారని ఈసారి కూడా అలాగే పంచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
టీడీపీ -జనసేనల సమన్వయ సమావేశం షెడ్యూల్‌నే నేతలు ఖరారు చేశారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 23న రాజమండ్రిలోఈ రెండు పార్టీల జేఏసీ భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్ లతో పాటు ఇరు పార్టీల ముఖ్యనేతలు పాల్గొన్నారు.
కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను - సుమో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందుతుంది. కాగా వీరంతా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జనసేనాని పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం సమావేశం అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలో జనసేన-బిజెపి పొత్తులపై అమిత్ షాతో పవన్ చర్చలు జరుపుతున్నారు.
రాష్ట్రంలోని మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె జగన్ సర్కారు పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారు మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలన్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ లీడర్ నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు. లోకేష్ సమర్ధుడైతే ఇంట్లోని మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని కామెంట్ చేశారు. ఈ మేరకు గుడివాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన లోకేష్ ఢీల్లీ పారిపోయి.. తన తల్లిని రోడ్లపై తిప్పుతున్నారని తీవ్రంగా విమర్శించారు.
: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వేదికగా అలయ్ బలయ్ వేడుక ఘనంగా జరుగుతోంది. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం సాగుతోంది.
విశాఖపట్నంలో వాషింగ్ మిషన్ లో భారీగా కరెన్సీ పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సుమారు రూ. కోటీ 30 లక్షలతో పాటు.. 30 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును విజయవాడ తరలిస్తుండగా ఎయిర్ పోర్టు జోన్ పోలీసులు పట్టుకోగా.. ఇది హవాలా మనీగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది.