Last Updated:

Traffic challans: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్

తెలంగాణలో వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 26 నుండి జనవరి 10, 2024 వరకు పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై తగ్గింపును ప్రకటించింది. తమ వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలానాలను ఈ-చలాన్ వెబ్‌సైట్ ద్వారా డిస్కౌంట్ ఉన్నంత వరకు క్లియర్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Traffic challans: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్

Traffic challans: తెలంగాణలో వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 26 నుండి జనవరి 10, 2024 వరకు పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై తగ్గింపును ప్రకటించింది. తమ వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలానాలను ఈ-చలాన్ వెబ్‌సైట్ ద్వారా డిస్కౌంట్ ఉన్నంత వరకు క్లియర్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

వాహనాల కేటగిరీ ప్రకారం తగ్గింపు ..(Traffic challans)

ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 20 శాతం చెల్లిస్తే మిగిలిన 80 శాతం పెండింగ్‌ చలానాలు మాఫీ అవుతాయి.
తోపుడు బళ్లు 10% చెల్లించినట్లయితే, మిగిలిన 90% మాఫీ అవుతుంది
తేలికపాటి మోటారు వాహనాలు (ఎల్‌ఎంవి), కార్లు, జీపులు మరియు భారీ వాహనాలకు 40% చెల్లిస్తే, మిగిలిన 60% మాఫీ అవుతుంది.
రోడ్డు రవాణా సంస్థ (RTC) బస్సులు 10% చెల్లిస్తే, మిగిలిన 90% మాఫీ చేయబడుతుంది.

చలానా చెల్లింపులు ఎలా చేయాలంటే..

తెలంగాణ ట్రాఫిక్-ఇంటిగ్రేటెడ్ ఇ-చలాన్ పోర్టల్‌కు లాగిన్ అవ్వాలి. వాహనం వివరాలను యథావిధిగా నమోదు చేస్తే అక్కడ అన్ని చలాన్లు ఒక వైపు కనపడతాయి.ఆ తర్వాత, పేపై క్లిక్ చేయాలి. చెల్లింపు పోర్టల్‌కి వెళ్లి రాయితీ మొత్తాన్ని మాత్రమే చెల్లించాలి.మీ సేవా కేంద్రాలలో కూడా చెల్లింపులు చేయవచ్చు.