Tirumala: వైకుంఠ ఏకాదశి: తిరుమలకు పోటెత్తిన వీఐపీలు, భక్తులు
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా చేరుకున్నారు. తెల్లవారుజామున 1:30 నిమిషాలకే విఐపిలను దర్శనానికి అనుమతించారు.
Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా చేరుకున్నారు. తెల్లవారుజామున 1:30 నిమిషాలకే విఐపిలను దర్శనానికి అనుమతించారు.
నాలుగు లక్షల పైగా టోకెన్లు..(Tirumala)
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఒంటిగంట 30 నిమిషాలకు విఐపి దర్శనాలని ప్రారంభించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 45 నిమిషాల ముందుగానే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకి దర్శనానికి అనుమతిస్తున్నామన్నారు. పది రోజులకు సంబంధించిన నాలుగు లక్షల 25 వేల టోకెన్లు తిరుపతిలో కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని వైకుంఠం1, వైకుంఠం 2 లో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరగానే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. భక్తులకి ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు పాలు నీళ్లు భక్తులకి బాటులోకి ఉంచామని భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా తొందరగా దర్శనం చేస్తున్నామన్నారు.