Last Updated:

Avinash Reddy: అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ పై స్టే విధించిన సుప్రీం కోర్టు

Avinash Reddy: అవినాష్ రెడ్డికి తెలంగాణ హై కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది. స్టే విధిస్తే.. అనివాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఆయన తరపు లాయల్ వాదనలు వినిపించారు.

Avinash Reddy: అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ పై స్టే విధించిన సుప్రీం కోర్టు

Avinash Reddy: మాజీ మంత్రి.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సుప్రీం మార్గదర్శకాలు జారీ చేసింది.

సుప్రీం కోర్టు స్టే..

మాజీ మంత్రి.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సుప్రీం మార్గదర్శకాలు జారీ చేసింది.

అవినాష్ రెడ్డికి తెలంగాణ హై కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది. స్టే విధిస్తే.. అనివాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఆయన తరపు లాయల్ వాదనలు వినిపించారు. దీంతో సోమవారం వరకు అవినాష్ ను అరెస్ట్ చేయవద్దని సుప్రీం కోర్టు సూచించింది.

తెలంగాణ హై కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను వివేకా కుమార్తె.. డాక్టర్ సునీత సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం.. తెలంగాణ హై కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఈ కేసును సోమవారం మరోసారి విచారణ చేపడతామని.. పూర్తి విషయాలు అప్పుడు పరిశీలిస్తామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన విషయం తెలిసిందే.