Nara Lokesh : హుటాహుటిన ఢిల్లీ నుంచి రాజమండ్రికి నారా లోకేష్..
టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ హుటాహుటిన ఢిల్లీ నుంచి రాజమండ్రికి చేరుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజమహేంద్రవరం వెళ్లారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ములాఖత్‌కు
Nara Lokesh : టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ హుటాహుటిన ఢిల్లీ నుంచి రాజమండ్రికి చేరుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజమహేంద్రవరం వెళ్లారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ములాఖత్‌కు ప్రయత్నిస్తున్నారు. ములాఖత్ కోసం జైలు అధికారులను వారు సంప్రదిస్తున్నారు. ములాఖత్‌పై జైలు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
జైల్లో చంద్రబాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో లోకేష్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేశారు. ఇవాళ చంద్రబాబుతో ములాఖత్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి జైలు అధికారులు ములాఖత్‌కు అనుమతి ఇస్తారా లేదా అన్నది చూడాలి. దీనిపై కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ నెల 10న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. మరుసటి రోజు కూడా విచారణకు వెళ్లారు.. అదే రోజు రాత్రి విచారణ తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్లారు.
ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. వారితో మాట్లాడిన తర్వాత లోకేష్ గారు రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం బయలుదేరి వెళ్లారు.#CBNLifeAtRisk #CBNJailedForDevelopingAP #CBNLifeUnderThreat… pic.twitter.com/nXi8CkMKYA
— Telugu Desam Party (@JaiTDP) October 14, 2023
అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. అయితే శుక్రవారం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడటం.. ఇటు చంద్రబాబు ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతుండటంతో లోకేష్ మళ్లీ తిరిగి ఏపీకి వచ్చారు. తిరిగి సోమవారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు క్వాష్, బెయిల్ పిటిషన్ లు సుప్రీం కోర్టులో విచారణ కారణంగా లోకేష్ అక్కడే ఉంటున్నారు.