Last Updated:

Director Raghavendrarao : ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి – దర్శకుడు రాఘవేంద్రరావు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడును సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను

Director Raghavendrarao : ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి – దర్శకుడు రాఘవేంద్రరావు

Director Raghavendrarao : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడును సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ఖండించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.

ఈ మేరకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా.. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని విమర్శించారు. ఒక విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి అని రాసుకొచ్చారు.