AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్‌పై మంత్రి ఫైర్

AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గవర్నర్ నజీర్‌కు సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వాగతం పలికారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మెజార్టీ విజయం ఇచ్చారన్నారు. గత పాలనలో రాష్ట్రం నష్టపోయిందన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు మేలు జరుగుతుందన్నారు. ప్రధానంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్పీ, అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. ప్రతి నెలా 1వ తేదీన పింఛన్లు, పేద విద్యార్థులకు చేయూత, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బీసీల కోసం స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో 34 శాతం రిజర్వేషన్లతో పాటు పథకాలు ప్రవేశపెట్టామన్నారు. అర్హులందరికీ సొంతిల్లు ఇవ్వాలనేదే తమ ఆకాంక్ష అని వెల్లడించారు.
అయితే అనర్మత వేటు తప్పించుకునేందుకు అసెంబ్లీకి వచ్చారనే విమర్శల తరుణంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన 11 నిమిషాలకే వైసీపీ సభ్యులతో ఆ పార్టీ అధినేత జగన్ బయటకు వెళ్లిపోయారు. అదే విధంగా గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా.. వైసీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు.
ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. కేవలం వారంతా హాజరు కోసమే వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు. సభ్యత్వం పోతాయనే భయంతోనే వచ్చినట్లు భావిస్తున్నామన్నారు.