Last Updated:

AP Assembly Day 3 : మూడోరోజు కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండు రోజులు సమావేశాలు వరుసగా కొనసాగగా.. మధ్యలో శని, ఆదివారం రావడంతో బ్రేక్ పడింది. ఇక ఈరోజు మూడోరోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కేంద్ర కార్యాలయం‌లో సమావేశం కానున్నారు.

AP Assembly Day 3 : మూడోరోజు కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

AP Assembly Day 3 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండు రోజులు సమావేశాలు వరుసగా కొనసాగగా.. మధ్యలో శని, ఆదివారం రావడంతో బ్రేక్ పడింది. ఇక ఈరోజు మూడోరోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కేంద్ర కార్యాలయం‌లో సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సమాంతర కార్యక్రమాల నిర్వహణపై చర్చించనున్నారు. కాగా ఈరోజు సభలో వైసీపీ ప్రభుత్వం తొమ్మిది బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులపై చర్చ కొనసాగనుంది. అంతకు ముందు గురు, శుక్ర వారాల్లో జరిగిన సమావేశాలలో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సభలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది.

అదే విధంగాగుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు, ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ లు, విద్యా దీవెన, వసతి దీవెన అంశాల పై ప్రశ్నలు జరుగనున్నాయి. బుడ్గా జంగం సామాజిక వర్గాన్ని ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్ కులాల జాబితాలో తిరిగి చేర్చాల్సిందిగా తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కేంద్రానికి విఙప్తి చేస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. అదే విధంగా మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ తీర్మానం చేయనుంది. రైతు రుణాలు, 9,10వ షెడ్యూల్ లో ఆస్తులు, తూర్పు కాపులకు బీసీ ధృవ పత్రం పై ప్రశ్నలపై చర్చ జరుగనుంది.

ప్రవేశ పెట్టబోతున్న బిల్లుల వివరాలు..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్ -2023

గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు -2023

ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్-2023

ఆంధ్రప్రదేశ్ భూదాన్ అండ్ గ్రామ దాన్ సవరణ బిల్

ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ సవరణ బిల్‌

మహిళా సాధికారత- రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు..

అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ

సమగ్ర భూ సర్వే, చుక్కల భూముల్లో సంస్కరణలు అసెంబ్లీ స్వల్పకాలిక చర్చలు జరుగనున్నాయి.