CM Ys Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అస్వస్థత.. వైరల్ ఫీవర్ కారణంగా అపాయింట్ మెంట్స్ రద్దు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. కాగా ఈ రోజు సీఎం జగన్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం అనంతరం ఆయన అపాయింట్‌మెంట్లన్నింటినీ అధికారులు రద్దు చేశారు. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన, బొత్స, పెద్దిరెడ్డితో పాటు
CM Ys Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. కాగా ఈ రోజు సీఎం జగన్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం అనంతరం ఆయన అపాయింట్‌మెంట్లన్నింటినీ అధికారులు రద్దు చేశారు. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన, బొత్స, పెద్దిరెడ్డితో పాటు ప్రభుత్వ విప్‌లు పాల్గొన్నారు. కాగా ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో వాటి నిర్వహణపై చర్చించారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ ఆమోదం తెలిపిన బిల్లుల వివరాలు..
- ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- జగనన్న సివిల్ సర్వీసెస్ ఇన్సెంటివ్ పేరుతో మరో పథకం ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్
- కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లు
- ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు
- ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు ఆమోదం.. అలానే అందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలను జాయింట్ సర్టిఫికేషన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ప్రస్తుతం ఉన్న ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కొత్తగా స్థాపించిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోని టాప్ 100 విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకునేలా చట్ట సవరణలకు నిర్ణయాలు తీసుకుంది.
- కురుపాం ఇంజనీరింగ్ కళాశాలల్లో గిరిజనులకు 50 శాతం సీట్లు కేటాయించే ప్రతిపాదన
- పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం
- అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు పీవోటీ చట్టం సవరణ బిల్లు
- భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లు
- రుణ చట్ట సవరణ బిల్లు