Home / తాజా వార్తలు
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన కార్యకర్తను పరామర్శించారు. శనివారం కడప జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితుడు అజయ్ ను పరామర్శించి దైర్యం చెప్పారు. పార్టీ తరపున సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
టీ కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
:బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) తమిళనాడు అధ్యక్షుడు కె ఆర్మ్‌స్ట్రాంగ్ ను శుక్రవారం, చెన్నైలోని తన ఇంటి సమీపంలో ఆరుగురు సభ్యుల ముఠా అతన్ని దారుణంగా నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష ముగిసింది. 11 రోజుల పాటు ఆయన ఈ దీక్షను చేపట్టారు. వారాహి అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో ముగిసింది.ప్రదోష కాలాన వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు.
దీర్ఘ కాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఇవాళ భేటీ కాబోతున్నారు.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. అయితే సమావేశానికి ముందే ప్రధాన కార్యాలయం వద్ద నుంచే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళనలతో జీహెచ్ఎంసీ దద్దరిల్లింది
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాటలో మరణించిన బాధితుల కుటుంబ సభ్యులను శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిశారు.హత్రాస్ పర్యటనకు ముందు అలీఘర్‌లోని పిలాఖ్నా గ్రామంలో ఆగి, అక్కడ కూడా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బీహార్ రాష్ట్రంలో రెండు వారాల్లో 12 వంతెనలు కూలిపోవడంతో 15 మంది ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొత్త వంతెనల పునర్నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆదేశించింది. వీటి నిర్మాణ వ్యయాన్ని దోషులుగా తేలిన కాంట్రాక్టర్లే భరించాలి.
నీట్ పేపర్ లీక్ ఘటనలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరుపుతోందని, దీనికి సంబంధించి పలు అరెస్టులు జరిగాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తన అఫిడవిట్లో తెలిపింది.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. ప్రధాని సహా 10 మంది కేంద్రమంత్రులను కలిశారు. ఏపీ అభివృద్ధి అంశాలపై ప్రధాని, కేంద్రమంత్రులకు విజ్ఞాపనలు చేశారు.