Last Updated:

TGPSC: గ్రూప్-1 అభ్యర్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రిజల్ట్స్ వచ్చేశాయ్

TGPSC: గ్రూప్-1 అభ్యర్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రిజల్ట్స్ వచ్చేశాయ్

TGPSC Group 1 Results Released: గ్రూప్ అభ్యర్థులకు అదిరిపోయే వార్త. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 563 పోస్టులకు గానూ టీజీపీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగానే మెయిన్స్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన అభ్యర్థుల ప్రిలిమినరీ మార్కుల వివరాలను వెల్లడించింది.

తాజాగా, టీజీపీఎస్‌సీ ప్రకటించిన ప్రీలిమినరీ లిస్ట్‌లో వచ్చిన మార్కులపై ఏమైనా సందేహాలుంటే.. వచ్చే 15 రోజుల్లో ఒక్కో పేపర్‌కు రీ కౌంటింగ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు కోసం రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల నుంచి రీ కౌంటింగ్ కోసం అభ్యంతరాలు స్వీకరించి ఆ తర్వాత 1:2 నిష్పత్తిలో ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయనుంది.

ఇదిలా ఉండగా, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను టీజీపీఎస్‌సీ గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 31,383 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం వెబ్ సైట్ https:www.tspsc.gov.in/ను సంప్రదించాలి.

అలాగే, రేపు గ్రూప్ 2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌, మార్చి 14న గ్రూప్ 3 ఎగ్జామ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను టీజీపీఎస్‌సీ విడుదల చేయనుంది.

ఇవి కూడా చదవండి: