Home / తాజా వార్తలు
ఏపీ వెళ్లి జగన్ పై పోరాడామని తాను గతంలోనే షర్మిలకు సూచించానని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి .హనుమంతరావు అన్నారు .తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ కళాశాలలో అమలా పురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌తో కలిసి అయన విలేకరులతో మాట్లాడారు.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి 20 గంటలు పడుతుంది . శుక్రవారం రద్దీ మరి ఎక్కువైంది . వారాంతరం కావడంతో రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తితిదే ప్రకటించింది
శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జిల్లాల వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన సర్కిళ్లు, గ్రామాలు, నగర శివార్లలో సెర్చ్ ఆపరేషన్ చెప్పారు. ఈ డ్రిల్‌లో నిందితులు,
ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ మరో సారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే దివాలా తీసిన జూనియర్ అంబానీపై మరో మారు పిడుగుపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకు అసలు విషయానికి వస్తే...ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (డీఏఎంఈపీఎల్) మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
డిజిటల్ పేమెంట్ కంపెనీ పేటీఎం అంటే 'పే త్రూ మొబైల్ " అని అర్ధం. ఇండియన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ, డిజిట్ పేమెంట్స్‌తో పాటు ఫైనాన్సియల్ సర్వీసెస్‌లో సేవలను అందిస్తోంది. ఈ సంస్థను 2010లో విజయశేఖర శర్మ వన్ 97 కమ్యూనికేషన్స్ పేరుతో స్థాపించారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నారా లోకేష్ ను నియమించాల్సిన సమయం వచ్చిందని టీడీపీ కి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు . ఈ ఎన్నికల్లో 130 స్థానాలు కూటమిగెలుచుకుని చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు .
జీహెచ్ఎంసీ లో మహిళా కార్మికులపై అకృత్యాలకు పాల్పడిన గాజులరామారం సర్కిల్ లోని శానిటేషన్ ఫీల్ట్ అసిస్టెంట్ కిషన్ ను డిస్మిస్ చేసారు . అతను చేసిన కీచకపర్వం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తీవ్రంగా పరిగణించి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసారు
: ఏపీలో ఈ నెల 13న ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే ,తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కి హై కోర్ట్ లో ఊరట లభించింది .
భద్రాచలం మారుతి పారా మెడికల్ నర్సింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అనుమానాస్పద మృతికి నిరసనగా.. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నిన్న హాస్టల్ బాత్రూమ్లో తీవ్ర గాయాలతో పడి ఉన్న కారుణ్యను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి గుట్టు రట్టైంది. కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ సబిత్ నాసిర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు దళారులు ఈ రాకెట్‌ను నడిపించారని.. అందులో ఒక వైద్యుడు ఉన్నాడని తేలింది.