Last Updated:

Modi Masjid: బెంగళూరులో మోదీ మసీదు

బెంగళూరులో మోదీ మసీదు పేరుతో ఒక మసీదు ఉంది. మోదీ అబ్దుల్ గపూర్ అనే వ్యక్తి 1849లో బెంగళూరులోని టాస్కర్ టౌన్‌లో నివసించారు. పర్షియా మరియు ఇతర దేశాలతో వర్తకం చేసిన ఈ మోదీ సంపన్న వ్యాపారి. ఆ ప్రాంతాన్ని అప్పుడు మిలిటరీ మరియు సివిల్ స్టేషన్ అని పిలిచేవారు.

Modi Masjid: బెంగళూరులో మోదీ మసీదు

Modi Masjid: బెంగళూరులో మోదీ మసీదు పేరుతో ఒక మసీదు ఉంది. మోదీ అబ్దుల్ గపూర్ అనే వ్యక్తి 1849లో బెంగళూరులోని టాస్కర్ టౌన్‌లో నివసించారు. పర్షియా మరియు ఇతర దేశాలతో వర్తకం చేసిన ఈ మోదీ సంపన్న వ్యాపారి. ఆ ప్రాంతాన్ని అప్పుడు మిలిటరీ మరియు సివిల్ స్టేషన్ అని పిలిచేవారు. . అతను నివసించిన ప్రాంతంలో ఒక మసీదు ఉండాలని భావించి అతను ఈ మసీదును నిర్మించాడు.

తర్వాత, మోదీ అబ్దుల్ గఫూర్ కుటుంబం బెంగళూరులోని పలు ప్రాంతాల్లో మరిన్ని మసీదులను నిర్మించింది. అతని జ్ఞాపకార్థం, టాన్నరీ ప్రాంతానికి సమీపంలో మోదీ రహదారి అని పిలువబడే రహదారి ఉంది.కాలక్రమేణా, పాత మసీదు దెబ్బతింది. 2015లో పాత నిర్మాణం స్థానంలో కొత్తది నిర్మించారు. కొత్త మసీదును ప్రజలకు తెరిచే సమయానికి, ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. “ఇది కేవలం యాదృచ్చికం,” అని ఆ ప్రాంతంలోని పండ్ల వ్యాపారి ముదస్సిర్ గుర్తుచేసుకున్నాడు.

అతను మోదీ మసీదుకు నిత్య సందర్శకుడు.ఈ మసీదులో 30,000 చదరపు అడుగుల స్థలం ఉంది. అన్ని సౌకర్యాలు ఉన్న ఈ మసీదును ఇండో-ఇస్లామిక్ శైలిలో నిర్మించారు. ఇక్కడ మహిళలు ప్రార్దన చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: