Last Updated:

India Map: ఇండియా మ్యాప్ లోపల కేసిఆర్ ఫోటో.. సిటీ పోలీస్ కు ఫిర్యాదు

తెరాస నేతలు అత్యుత్సాం చూపించారు. భారత దేశ మ్యాప్ లో జాతీయ రంగులతో పాటు సీఎం కేసిఆర్ ఫోటోను ముద్రించి ఆయనపై ఉన్న తమ అభిమానాన్ని నేతలు చాటుకొన్నారు. దాన్ని ఫ్లెక్సీపై ముద్రించి సోమాజీగూడ సిగ్నల్ వద్ద హోర్డింగ్ రూపంలో ఏర్పాటు చేశారు.

India Map: ఇండియా మ్యాప్ లోపల కేసిఆర్ ఫోటో.. సిటీ పోలీస్ కు ఫిర్యాదు

Hyderabad: తెరాస నేతలు అత్యుత్సాం చూపించారు. భారత దేశ మ్యాప్ లో జాతీయ రంగులతో పాటు సీఎం కేసిఆర్ ఫోటోను ముద్రించి ఆయన పై ఉన్న తమ అభిమానాన్ని నేతలు చాటుకొన్నారు. దాన్ని ఫ్లెక్సీ పై ముద్రించి సోమాజీగూడ సిగ్నల్ వద్ద హోర్డింగ్ రూపంలో ఏర్పాటు చేశారు.

అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సాగర్ గౌడ్ అనే వ్యక్తి హైదరాబాదు సిటీ పోలీసుకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై మీరు కేసు బుక్ చేయగలరా? అంటూ ప్రశ్నించాడు. ఆ వ్యక్తికి హైదరాబాదు సిటీ పోలీసు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా బదులు కూడా ఇచ్చింది. ఫ్లెక్సీ ఏర్పాటు పై పరిశీలిస్తాం అంటూ జవాబిచ్చారు.

ఫ్లెక్సీలో ముద్రించిన మ్యాప్ లోపల భాగం మీదుగా దేశంలో ఎంతమంది నాయకులు ఉన్నా కేసిఆర్ లాంటి ఒక్క ఆలోచనపరుడు ఉంటే చాలు అని వ్యాఖ్యలు కూడా వ్రాసారు. అందులో కొన్ని రాష్ట్రాల ప్రాంతాలను కూడా కనపడీ కనపడన్నట్లు ముద్రించారు. భవిష్యత్ లో ఇలాంటివి చేపడితే దేశ భూభాగ రేఖలను గుర్తు పట్టడం ఎలానంటూ కొందరూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. దీంతో ఫ్లెక్సీ వ్యవహారం వైరల్ గా మారింది. ఫిర్యాదుకు దారితీసింది.

స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహానుభావుల తలుచుకొనే క్రమంలో ఇలా వారి వారి ఫోటోలను ముద్రించేవారు. నేడు ప్రతి రాజకీయ నాయకుడు తమ అవసరాలకు ఇలా దేశ ప్రాంతాలను గుర్తించే మ్యాప్ లపై ఇష్టం మొచ్చిన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు కేంద్రం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొని రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: గాలికి షాకిచ్చిన సుప్రీం కోర్టు

ఇవి కూడా చదవండి: