Last Updated:

Horoscope Today: ఈ రాశి వారికి గుడ్ న్యూస్.. నేటి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today: నేడు ఈ రాశుల వారు శుభవార్త వింటారు. జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల ఆ విషయంలో నిరుద్యోగులు శుభవార్త వింటారు. అలానే ఫిబ్రవరి 20 వ తేదీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

Horoscope Today: ఈ రాశి వారికి గుడ్ న్యూస్.. నేటి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today: నేడు ఈ రాశుల వారు శుభవార్త వింటారు. జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల ఆ విషయంలో నిరుద్యోగులు శుభవార్త వింటారు. అలానే ఫిబ్రవరి 20 వ తేదీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

మేషం: ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. నిరుద్యోగులు మాత్రం.. ఉద్యోగాలకు సంబంధించి శుభవార్త వింటారు. వ్యక్తిగత సమస్యలు.. స్నేహితుల సాయంతో పూర్తి చేస్తారు. అలాగే ముఖ్యమైన పనులను వీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులకు ఆర్థికంగా సాయం చేసే అవకాశం ఉంది. మీ బంధు వర్గంలో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఈ రాశి వారి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారంలో సానుకూలత ఉంటుంది.

వృషభం: ఈ రాశి వారికి ఆర్ధిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ఉన్న లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆదాయానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పట్టుదలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్త ఉంటుంది. ఈ రాశి వారికి చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం వస్తుంది. అనవసర హామీలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంలో ఎలాంటి మార్పు ఉండదు.

మిథునం: ఉద్యోగం, పనిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. వైద్యపరమైన ఖర్చులు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపార రంగంలో కాస్త ఒత్తిడి ఉంటుంది. ఈ రాశి వారికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నేడు ఓ మంచి అవకాశం వస్తుంది.

నేడు ఈ రాశుల వారికి శుభవార్త (Horoscope Today)

కర్కాటకం: ఈ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతుంటాయి. కొత్త పనిలో నిమగ్నం అవుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది.

సింహం: ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి వచ్చి అవసరాలు తీరుతాయి. పట్టుదలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపార రంగంలో కాస్త ఇబ్బందులు ఉంటాయి. వృత్తి నిపుణులకు నేడు అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. అదనపు ఆదాయానికి ప్రయత్నాలు చేస్తారు.

కన్య: ఈ రాశి వారు ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. వ్యాపారంలో లాభాలు ముందుకు సాగుతాయి. పలుకుబడి ఉన్నవారితో ఎక్కువగా పరిచయాలు పెరుగుతాయి. బంధువులకు ఆర్ధిక సహాయం చేస్తారు. ముఖ్యమైన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

తుల: ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈ రాశి వారికి బయట ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు సంపాదిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. డబ్బు జాగ్రత్త విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం: నేడు ఈ రాశి వారి ఆదాయం తగ్గే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం మారాలని ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు స్థానికంగానే ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సాయం చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పెళ్లి సంబంధం వెనక్కి పోతుంది.

నిరుద్యోగులకు ఉద్యోగాలు కలిగే అవకాశం

ధనుస్సు: ఉద్యోగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత మరింత మెరుగుపడుతుంది. సమాజానికి మేలు కలిగే పనులు ప్రారంభిస్తారు. వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారికి రుణ భారం తగ్గుతుంది. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

మకరం: ఉద్యోగ వాతావరణం బాగానే ఉంటుంది. ఈ రాశి వారికి ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారం చాలావరకు నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం: ఆశించిన స్థాయిలో ఈ రాశి వారికి ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. తలపెట్టిన పనుల కోసం శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలకు అనుకూల సమయం.

మీనం: ఉద్యోగ జీవితం పరవాలేదు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ సమస్య ఒకటి సామరస్యంగా పరిష్కారం అవుతుంది. స్నేహితులు చేదోడు వాదోడుగా ఉంటారు. దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు మంచిగా ఉంటాయి.