Dominique Lapierre: సిటీ ఆఫ్ జాయ్ రచయిత డొమినిక్ లాపియర్ కన్నుమూత
కోల్‌కతాపై సిటీ ఆఫ్ జాయ్ పుస్తకంరాసిన ఫ్రెంచ్ రచయిత డొమినిక్ లాపియర్ కన్నుమూసారు. ఆయన వయసు 91.లాపియర్ భార్య డొమినిక్ కాంకాన్ఈ వార్తను ధృవీకరించారు. కాంకాన్-లాపియర్ వయసుకు సంబంధించిన అనారోగ్య సమస్యల కారణంగా మరణించినట్లు చెప్పారు.
Dominique Lapierre: కోల్‌కతాపై సిటీ ఆఫ్ జాయ్ పుస్తకంరాసిన ఫ్రెంచ్ రచయిత డొమినిక్ లాపియర్ కన్నుమూసారు. ఆయన వయసు 91.లాపియర్ భార్య డొమినిక్ కాంకాన్ఈ వార్తను ధృవీకరించారు. కాంకాన్-లాపియర్ వయసుకు సంబంధించిన అనారోగ్య సమస్యల కారణంగా మరణించినట్లు చెప్పారు.
జూలై 30, 1931లో ఫ్రాన్స్‌లోని చటెలైలోన్లో జన్మించిన లాపియర్ పారిస్-మ్యాచ్ రిపోర్టర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. అతను యూఎస్ జర్నలిస్ట్ లారీ కాలిన్స్‌తో కలిసి అనేక ఆరు సంపుటాలను రాసారు. వాటిలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పారిస్ విముక్తిపై ఈజ్ పారిస్ బర్నింగ్? అంటూ రాసిన పుస్తకం ఒకటి. 1972లో, ఓ జెరూసలేం కోసం కాలిన్స్ లాపియర్తో భాగస్వామి అయ్యారు.1975లో ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ మరియు 1980లో ది ఫిఫ్త్ హార్స్‌మ్యాన్ మరియు 2005లోఈజ్ న్యూయార్క్ బర్నింగ్? పుస్తకాలు రచించారు. ఆయన రచనల్లో బియాండ్ లవ్ (1990) మరియు ఎ థౌజండ్ సన్స్ (1999) అంతర్జాతీయంగా బెస్ట్ సెల్లర్‌గా ఉన్నాయి. ది సిటీ ఆఫ్ జాయ్, 1985లో ప్రచురించబడింది. కోల్‌కతా యొక్క పేదలగురించి ఇందులో ఆయన రాసుకొచ్చారు. సిటీ ఆఫ్ జాయ్ సినిమాగా తెరకెక్కించారు. 1992లో రోలాండ్ జోఫె దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాట్రిక్ స్వేజ్, ఓం పురి, షబానా అజ్మీ మరియు పౌలిన్ కాలిన్స్ నటించారు.
1981లో, లాపియర్స్ కోల్‌కతాలో ఉన్న ఒక లాభాపేక్షలేని మానవతా సంస్థ అయిన సిటీ ఆఫ్ జాయ్ ఎయిడ్‌ను స్థాపించారు. ఇది క్లినిక్‌లు, పాఠశాలలు, పునరావాస కేంద్రాలు మరియు హాస్పిటల్ బోట్ల నెట్‌వర్క్‌ను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. అతని నవలలు, మరియు ఇతర పుస్తకాల నుండి రాయల్టీలు, ఉపన్యాస రుసుము మరియు పాఠకుల విరాళాలతో పాటు, స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.లాపియర్కు 2008లో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ లభించింది.