Syria: రణరంగంగా సిరియా.. 17 మంది మృతి
Syria says 17 security personnel killed in ambush by Assad loyalists: సిరియా రణరంగంగా మారింది. ప్రభుత్వ అధికారిని అరెస్ట్ చేసే క్రమంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ గొడవల కారణంగా 17 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఓ అధికారిని అరెస్ట్ చేసేందుకు రెబల్స్ ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
బషర్ అల్ అసద్ ప్రభుత్వ హయాంలో సైనిక న్యాయ విభాగం డైరెక్టర్, ఫీల్డ్ కోర్ట్ చీఫ్గా ఓ అధికారి బాధ్యతలు నిర్వహించాడు. ఈ సమయంలో చాలామంది ఖైదీలకు కారణం లేకుండానే మరణశిక్ష విధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారిని అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు జారీ కావడంతో బలగాలు రంగంలోకి దిగాయి.
సంబంధిత అధికారిని అరెస్ట్ చేసే క్రమంలోనే టార్టస్ ప్రావిన్స్ సహా పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో 17మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో జనరల్ సెక్యూరిటీ ఫోర్సెస్లో 14 మంది, ఖిర్బెత్తో మరో ముగ్గురు మృతి చెందారని మ్యూమన్స్ రైట్స్ సంస్థ తెలిపింది.