Kami Rita Record: ఎవరెస్ట్ శిఖరం 31 సార్లు అధిరోహణ.. కామి రిటా రికార్డ్

Kami Rita Record: నేపాలీ షెర్పా, ప్రముఖ పర్వాతారోహకుడు కామి రిటా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటికే 30 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన కామి రిటా.. తాజాగా మరోసారి ఎవరెస్ట్ పైకి ఎక్కాడు. దీంతో అత్యధిక పర్యాయాలు ఎవరెస్ట్ ను అధిరోహించిన వ్యక్తిగా రికార్డ్ నెలకొల్పాడు. గతంలో అత్యధిక సార్లు ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా తన పేరుమీదు ఉన్న రికార్డును తిరగరాశాడు. ఇవాళ ఉదయం 4 గంటలకు కామి రిటా ఈ ఘనత సాధించాడు.
రెండేళ్లుగా ట్రెక్కర్ కామి రిటా ప్రతి సీజన్ లో రెండు పర్యాయాలు ఎవరెస్ట్ ను ఎక్కుతుంటాడు. తాజాగా భారత సైన్యానికి చెందిన బ్యాచ్ ను తనతో పాటు కామి రిటా తీసుకెళ్లాడు. సెవన్ సమ్మిట్ ట్రెక్స్, 14 పీక్స్ ఎక్స్ పెడిషన్ లో సీనియర్ గైడ్ గా కామి రిటా పనిచేస్తున్నాడు. కాగా కామి రిటాకు చిన్నతనం నుంచి పర్వాతాలు ఎక్కడం ఆసక్తిగా మార్చుకున్నారు. తొలిసారిగా 1992లో ఆయన ఎవరెస్ట్ ను అధిరోహించాడు. తొలిసారిగా ఓ బృందానికి సపోర్ట్ సభ్యుడిగా వెళ్లాడు. అప్పటి నుంచి మళ్లీ, మళ్లీ ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నం చేశాడు. 1994 నుంచి 2025 వరకు కామి రిటా ఎవరెస్ట్ ను 31 సార్లు దిగ్విజయంగా అధిరోహించాడు. దీంతో కామి రిటాను పలువురు అభినందిస్తున్నారు.