Home / Nepal
Earthquake of magnitude 7.1 strikes Nepal: నేపాల్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భూమి కంపించింది. అయితే రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్, టిబెట్ సరిహద్దులో ఉన్న లబుచే అనే ప్రాంతానికి సుమారు 93 కి.మీల దూరంలో భూకంప కేంద్రంను అధికారులు గుర్తించారు. ఈ భూకంప తీవ్రతకు భారత్ లో పలు రాష్ట్రాల్లో సైతం భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, […]
నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ 'ప్రచండ' శుక్రవారం పార్లమెంటులో తన ప్రభుత్వం పై పెట్టిన అవివిశ్వాస తీర్మానంలో ఓటమి పాలయ్యారు. ప్రభుత్వానికి అనుకూలంగా 63 ఓట్లు రాగా వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి.
నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో రెండు ప్రయాణీకుల బస్సులు నదిలో కొట్టుకుపోయాయి.రెండు బస్సులు 65 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నాయి. గల్లంతయిన వారిలో ఏడుగురు బారతీయులు ఉన్నారు.
నేపాల్‌లో గత 24 గంటల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగులు పడటంతో 14 మంది మరణించారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్‌డిఆర్‌ఎంఎ) ప్రకారం, కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది, పిడుగుపాటు కారణంగా ఐదుగురు మరియు వరదల కారణంగా ఒకరు మరణించారు.
నేపాల్‌లోని లుంబినీ ప్రావిన్స్‌లో ఉన్న రప్తి నదిలో శుక్రవారం ప్రయాణీకుల బస్సు పడిపోవడంతో ఇద్దరు భారతీయులతో సహా కనీసం 12 మంది మరణించారు. ఖాట్మండు పోస్ట్ ప్రకారం, బస్సు నేపాల్‌గంజ్ నుండి ఖాట్మండుకు వెళుతుండగా, భలుబాంగ్‌లోని రప్తి వంతెనపై నుండి ఈస్ట్-వెస్ట్ హైవే వెంబడి నదిలోకి పడిపోయింది.
నేపాల్ పోలీసులు లైంగిక వేధింపులు, కిడ్నాప్ ఆరోపణలపై 'బుద్ధ బాయ్'గా ప్రసిద్ధి చెందిన వివాదాస్పద ఆధ్యాత్మిక నాయకుడు రామ్ బహదూర్ బొమ్‌జన్‌ను అరెస్టు చేశారు. 2020లో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన తర్వాత బొమ్‌జన్‌ను మైనర్‌పై లైంగిక దోపిడీ కేసులో పరారీలో ఉన్నప్పుడు అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
నేపాల్‌లోని మాధేష్ ప్రావిన్స్‌లోని పర్వత రహదారికి 50 మీటర్ల దూరంలో వారు ప్రయాణిస్తున్న బస్సు పడిపోవడంతో ఆరుగురు భారతీయ యాత్రికులతో సహా ఏడుగురు మరణించినట్లు మీడియా నివేదిక గురువారం తెలిపింది.
ఆదిపురుష్ సినిమా ఇటీవల ఇండియాలో విడుదలైంది. సినిమా విడుదలైనప్పటి నుంచి ఏదో వివాదం వెంటాడుతూనే ఉంది. కలెక్షన్ల పరంగా సినిమా బాగానే డబ్బు వసూళ్లు చేస్తోంది. ఇండియా సంగతి పక్కనపెడితే పొరుగున ఉన్న నేపాల్ మాత్రం ఆదిపురుష్ సినిమాలోని డైలాగ్‌ల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉంది.
నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్ చంద్ర పాడెల్ ఎన్నికయ్యారు. అతను 33 వేల 8 వందల 2 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, అతని ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబ్వాంగ్ కు 15 వేల 5 వందల 18 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినట్లు నేపాల్ ఎన్నికల సంఘం తెలిపింది.
నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది.నేపాల్ పార్లమెంట్లో రెండవ అతిపెద్ద పార్టీ సీపీఎన్ (యుఎంఎల్) సోమవారం ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ "ప్రచండ" నేతృత్వంలోని ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది