Soak Mangoes: తినే ముందు మామిడిపండ్లను నీటిలో నానబెట్టాలా? అలా చేయడం వల్ల ఉపయోగమేంటీ?
వేసవి వచ్చిదంటే ముందుకు గుర్తుకు వచ్చేవి మామిడి పండ్లు. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఎంతో ఇష్టంగా తినే పండు ఇదే.
Soak Mangoes: వేసవి వచ్చిదంటే ముందుకు గుర్తుకు వచ్చేవి మామిడి పండ్లు. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఎంతో ఇష్టంగా తినే పండు ఇదే. సీజనల్ పండు కాబట్టి ధర గురించి పెద్దగా ఆలోచించకుండా తింటుంటారు. కానీ ఈ పండును తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టాలని చెబుతుంటారు. కానీ ఎందుకు నీటిలో నానబెట్టాలో తెలియదు. మన పూర్వికులు కూడా మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టేవాళ్లని చెబుతుంటారు. దీని కారణమేంటో చూద్దాం.
అమ్మమ్మల కాలం నుంచే(Soak Mangoes)
మన అమ్మమ్మలు, నానమ్మలు కాలం నాటి నుంచే మామిడి పండ్లను తినేముందు.. కాసేపు నీటిలో నానబెట్టి తినేవారు. ఇపుడు కూడా అదే పద్ధతిలో తినాలని సూచిస్తున్నారు. అందుకు కారణముంది. మామిడి పండ్లలో ఉత్పత్తి అయ్యే అదనపు ఫైటిక్ ఆమ్లం తొలగించడానికి నీళ్లలో నానబెట్టాలి. ఒక్క మామిడి పండులోనే కాకుండా వివిధ కూరగాయలు, ధాన్యాలు, పప్పులు లాంటి వాటిలో కూడా ఈ ఫైటిక్ ఆమ్లం ఉంటుంది. ఇలా నీళ్లలో నానబెట్టడం వల్ల అవి తొలగిపోతాయి. ఈ ఫైటిక్ యాసిడ్ అదనపు వేడిని కూడా రిలీజ్ చేస్తాయి. అయితే ఎప్పుడైతే నీటిలో నానడం వల్ల ఆ అదనపు వేడి కూడా తగ్గుతుంది.
న్యూటిషియన్స్ ఏం చెబుతున్నారంటే..
న్యూటిషియన్స్ చెబుతున్న దాని ప్రకారం.. మామిడి పండ్లను 10 నిమిషాల నుంచి గంట పాటు నీళ్లలో నానబెట్టడం వల్ల వాటి తొక్కపై కంటికి కనిపించకుండా ఉండే నూనెలు తొలిగి పోతాయి. ఆ నూనెల వల్ల కొందరిలో ఎలర్జీలు కలిగే అవకాశం ఉంది. అదే విధంగా పాలిఫెనాల్స్, టానిన్స్ లాంటి సూక్ష్మ పదార్థాల మిశ్రమం మామిడి పండు తొక్కపై ఉండే అవకాశం ఉంది. అవి శరీరంలో చేరితే దురద, బొబ్బలు రావడానికి కారణమవుతాయి. ఇలా మామిడి నీళ్లలో నానబెట్టడం వల్ల అవన్నీ తొలిగిపోతాయి. దీంతో పండు తినేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మామాడి పండ్లను ప్రిడ్జ్ లో పెట్టడం కంటే నీటిలో నానబెట్టడం వల్ల వాటికి ఉండే సహజమైన తీపి, సువాసనకు పొందొచ్చు. అదే విధంగా అవి తిరిగి హైడ్రేటింగ్ గా మారుస్తాయి.
రోగ నిరోధకశక్తిని పెంచేందుకు
వేసవిలో మాత్రమే దొరికేవి మామిడి పండ్లను.. సీజన్ కు తగినట్టు కచ్చితంగా తీసుకోవాలి. దీంతో వేసవిలో వచ్చే రోగాల నుంచి కాపాడేందుకు రోగ నిరోధక శక్తి అందుతుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. మహిళలు, పిల్లలు మామిడి పండ్లను తినడం వల్ల రక్త హీనత తగ్గుతుంది. అంతేకాకుండా మామిడి పండు సులువుగా జీర్ణం కూడా అవుతుంది.