Garlic: రోజూ పరిగడుపున వెల్లిల్లి తింటే ఏమవుతుందో తెలుసా
Garlic: ఉల్లి వెల్లుల్లి లేని ఇళ్లు ఉండవు అనడంలో సందేహం లేదు. ప్రతి వంటింట్లో వెల్లుల్లి అనేది ఖచ్చితంగా ఉపయోగించే వంట ఉపకరణాలలో ఒకటి. మరి అలాంటి వెల్లుల్లితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా
Garlic: ఉల్లి వెల్లుల్లి లేని ఇళ్లు ఉండవు అనడంలో సందేహం లేదు. ప్రతి వంటింట్లో వెల్లుల్లి అనేది ఖచ్చితంగా ఉపయోగించే వంట ఉపకరణాలలో ఒకటి. ఈ వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, మాంగనీస్, సెలీనియం, ఫైబర్స్, ఐరన్, కాల్షియం, భాస్వరం, రాగి, పొటాషియంతో సహా ఎన్నోరకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండోయ్. వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఇది అనేక జీర్ణ సమస్యలు, కడుపు ఇన్ఫెక్షన్లు వంటివి దరిచేరకుండా కాపాడుతుంది.
ఎన్ని ప్రయోజనాలో తెలుసా(Garlic)
రోజూ వెల్లుల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. వెల్లుల్లి అధిక రక్తపోటును, శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. వెల్లుల్లి తుమ్ములు, జలుబు, దగ్గు లక్షణాలను తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి వెల్లుల్లిని రోజూవారి డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ కాంపోనెంట్స్ శ్వాసకోశ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగించడమే కాకుండా కాలేయం కూడా హెల్తీగా ఉండేలా సహాయపడుతుంది.
వెల్లుల్లి బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికే కాకుండా బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలోని మరొక ప్రత్యేకత ఏంటంటే.. పచ్చి వెల్లుల్లిని ఉదయం పరిగడుపున తింటే ఇది మన ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల మీరు అతిగా తినలేరు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.