Last Updated:

Senagapappu Patoli Recipe: శనగపప్పుతో పాఠోలీ తయారీ

సాధారణంగా పచ్చి శనగపప్పును కూరల్లో ఉపయోగిస్తారు. అయితే శనగపప్పును కూరగా తయారు చేసుకోవచ్చు. దీనిని పాఠోళీ అంటారు. ఇటీవల కాలంలో దీనిని తయారు చేయడం తగ్గింది. కాని సెలవుదినాల్లో వెరైటీ టేస్ట్ కోరుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.

Senagapappu Patoli Recipe: శనగపప్పుతో పాఠోలీ తయారీ

Senagapappu Patoli Recipe: సాధారణంగా పచ్చి శనగపప్పును కూరల్లో ఉపయోగిస్తారు. అయితే శనగపప్పును కూరగా తయారు చేసుకోవచ్చు. దీనిని పాఠోళీ అంటారు. ఇటీవల కాలంలో దీనిని తయారు చేయడం తగ్గింది. కాని సెలవుదినాల్లో వెరైటీ టేస్ట్ కోరుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇపుడు చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు..

శనగపప్పు -నాలుగు కప్పులు,
అల్లం -రెండు చెంచాలు
పచ్చిమిర్చి -రెండు చెంచాలు,
కరివేపాకు -కొంచెం
ఉప్పు,
నూనె -తగినంత,
మెంతి ఆకులు కట్ట-1

తయారు చేయు విధానం..
శనగపప్పు బాగా ఎనిమిది గంటలు నానాలి. తరువాతనీరు ఒంపేసి గ్రైండ్ చెయ్యాలి. ఆ ముద్దను ఒక గిన్నెలో పెట్టి కుక్కరులో పెట్టాలి 3విజిల్స్ వచ్చాక దించి మళ్లీ మిక్సీ చెయ్యాలి. మూకుడులో నూనె శనగపప్పు, ఉద్ది, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, మెంతి ఆకులు కడిగి వేయించాలి. అనంతరం శనగముద్ద ఉప్పు కొంచెం నూనెవేసి సన్నపు సెగ మీద పెట్టాలి. పిండి అంతా పొడిపొడిగా మారాలి. అనంతరం దించి చల్లారాక బాగా కలపాలి. దీనిని అన్నంలో కలుపుకుని తింటి మంచి రుచిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి: