Varun Tej VT15: మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా.. ఇండో కొరియన్ హారర్ కామెడీగా!

Varun Tej New Movie VT15 Begins Filming With a Pooja Ceremony: టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ VT -15కి సంతకం చేశారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందించనుండగా.. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ మూవీ ఇండో, కొరియన్ హారర్ కామెడీగా రూపొందనుంది.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగింది. మూవీ యూనిట్‌తో పాటు దర్శకుడు క్రిష్, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి, సోదరి నిహారిక, హీరోయిన్ రితికా నాయక్ పాల్గొన్నారు. అనంతరం సినిమా బృందానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఇదిలా ఉండగా, వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత వెంటవెంటనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక, మంచి హిట్ కోసం వరుణ్ తేజ్ ప్రయత్నిస్తున్నాడు.
గతేడాది వరుణ్ తేజ్ నటించిన ‘మట్కా’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సారైనా మెగా హీరో వరుణ్ తేజ్ హిట్ కొడతాడో చూడాలి మరి.అలాగే ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న మేర్లపాక గాంధీ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘ఏక్ మినీ కథ’ వంటి సినిమాలను తెరకెక్కించారు.