Published On:

3 Roses S2: లక్కీ ఛాన్స్ పట్టేసిన బజ్జీల పాప.. బోల్డ్ లుక్ తో ఎంట్రీ

3 Roses S2: లక్కీ ఛాన్స్ పట్టేసిన బజ్జీల పాప.. బోల్డ్ లుక్ తో ఎంట్రీ

3 Roses S2: ఆహా ఒరిజినల్ గా తెరకెక్కిన సిరీస్ 3 రోజెస్. పాయల్ రాజ్ పుత్, ఈషా రెబ్బ, పూర్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది. మారుతీ క్రియేట్ చేసిన ఈ సిరీస్ కు కిరణ్ దర్శకత్వం వహించగా.. రవి నంబూరి కథను అందించాడు. ఆహాలో ఈ సిరీస్ ఎంతో మంచి హిట్ అయ్యింది. ముగ్గురు అమ్మాయిలు.. తమ తమ జీవితాల్లో ఎలా ఎదిగారు. వారి కెరీర్లను ఎలా మలుచుకున్నారు.. ? అనేది ఎంతో వినోదాత్మకంగా చూపించారు.

 

ఇక ఈ సిరీస్ లో మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ కూడా నటించాడు. ఇక సీజన్ 1 ముగిసాకా.. ఎప్పుడెప్పుడు సీజన్ 2 మొదలవుతుందా.. ? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు. ఎట్టకేలకు ఈ మధ్యనే 3 రోజెస్ సీజన్ 2 ను మేకర్స్ ప్రకటించారు. ఈసారి 3 రోజెస్ తో పాటు ఇంకో రోజ్ ను కూడా రంగంలోకి దింపారు. తాజాగా మరో కొత్త రోజ్ ను మేకర్స్ పరిచయం చేసారు. ఆ రోజ్ ఎవరో కాదు.. కుషితా కల్లపు.

 

సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి కుషితా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నదానికి ముద్దుగా బజ్జీల పాప అని పిలుచుకుంటారు.  ఒక హోటల్ లో డ్రగ్స్ రైడ్ అవుతుంటే.. ఈ చిన్నది దొరికింది. అక్కడకు ఎందుకు వెళ్ళావు అంటే.. బజ్జీలు బావుంటాయని బయట చెప్తే తినడానికి వచ్చామని చెప్పుకొచ్చింది. అప్పటినుంచి అమ్మడికి బజ్జీల పాప అనే పేరు వచ్చింది. ఇక ఆ గుర్తింపుతో కుషితా స్టార్ హీరో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది.

 

ఇక ఎట్టకేలకు కుషితా 3 రోజెస్ సీజన్ 2 తో ఒక లక్కీ ఛాన్స్ పట్టేసింది. తాజాగా అమ్మడి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ మొదటి షాట్ లోనే ముద్దుగుమ్మ బట్టలు లేకుండా బోల్డ్ లుక్ తో దర్శనమిచ్చింది. ఈసారి ఈ సీజన్ లో పాయల్, పూర్ణ కనిపించరని టాక్. అందుకే కొత్త బ్యూటీని దింపినట్లు సమాచారం. త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సిరీస్ తో ఈ ముద్దుగుమ్మ తన టాలెంట్ చూపించి హిట్ అందుకుంటుందేమో చూడాలి.