Published On:

Cardio or Weight Lift: కార్డియో – వెయిట్ లిఫ్టింగ్ రెండూ ఒకే సారి ఎందుకు చేయకూడదు?

Cardio or Weight Lift: కార్డియో – వెయిట్ లిఫ్టింగ్ రెండూ ఒకే సారి ఎందుకు చేయకూడదు?

 

Cardio or Weight Lift: వ్యాయామం అంటే కేవలం బరువులు ఎత్తడమే కాదు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. మామూలుగా జిమ్ కు వెళ్లే వాళ్లకు ఈ విషయం తెలుసు. అయితే. రెండురకాలలో ఒకటి కార్డియో, రెండవది వెయిట్ లిఫ్టింగ్. కార్డియో అంటే గుండెకు సంబంధించిన వ్యాయామం అని అర్థం. ఇందులో త్రెడ్ మిల్, సైక్లింగ్ లాంటివి వస్తాయి. ఇందులో బరువులు ఎత్తడం ఉండదు. కేవలం రన్నింగ్ లాంటివే ఉంటాయి. ఇక రెండవది వెయిట్ లిఫ్టింగ్ దీని గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు, డంబెల్స్ లాంటి వాటితో బరువులు ఎత్తుతూ వ్యాయామం చేస్తారు.

కార్డియో, వెయిట్ లిఫ్టింగ్ రెండూ ఆరోగ్యకరమైన వ్యాయామాలు. వీటిని రెండింటిని కలిపి చేయడం ద్వారా శరీరానికి మంచి ఆకృతి ఏర్పడుతుంది. దీంతో పాటే నడక, సైక్లింగ్,ఈత వంటి కార్డియో వ్యాయామాలు చేయాలి. ఇవి గుండె, ఊపిరితిత్తులను బలపరుస్తుంది, కేలరీలను బర్న్ చేస్తుంది. మరోవైపు, వెయిట్ లిఫ్టింగ్ కండరాలను నిర్మిస్తుంది, ఎముకలను బలపరుస్తుంది. రెండింటిని కలిపి సాధన చేసినప్పుడు, అవి ఒకదానికొకటి సపొర్ట్ గా ఉండి మొత్తం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, కొవ్వు తగ్గడానికి మద్దతు ఇస్తాయి.

 

కార్డియో మరియు వెయిట్ లిఫ్టింగ్ సాధన యొక్క ప్రయోజనాలు

1. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది
కార్డియో చేయడం వలన హృదయ స్పందన రేటు పెరుగుతుంది. దీంతో రక్త ప్రసరణను పెరుగుతుంది. కార్డియో హృదయనాళాల పనితీరును పెంచుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది, శరీరం అంతటా ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 

2. కండరాల బలం
వెయిట్ లిఫ్టింగ్ చేయడం వలన కండరాలు, ఎముకలు బలపడతాయి. వయసు పెరిగే కొద్దీ ఎముక సాంద్రతను కాపాడుకోవడానికి ఈ వ్యాయామం చాలా ముఖ్యం. వయసురిత్యా ఎముకలలో వచ్చే సమస్యలు పగుళ్ల ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది చాలా ముఖ్యం.

3. మెరుగైన బరువు నిర్వహణ 
కార్డియో చేసేటప్పుడు గణనీయంగా కేలరీలను బర్న్ అవుతాయి. దీంతో పాటే వెయిట్ లిఫ్టింగ్ చేయడంతో జీవక్రియ రేటును పెంచుతుంది. వెయిట్ లిఫ్టింగ్ వలన మజిల్ పెరుగుతుంది. రోజంతా ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో వెయిట్ లిఫ్టింగ్ సహాయపడుతుంది.

4. ఏరోబిక్ సామర్థ్యం పెరుగుతుంది 
రెగ్యులర్ గా కార్డియో వ్యాయామాలు చేస్తుంటే ఏరోబిక్ సామర్థ్యం పెరుగుతుంది. అంటే అథ్లెట్ లాంటి ఫిట్ నెస్ దక్కుతుంది. దీనివలన ఎండార్ఫిన్‌ అధికంగా విడుదల అవతుంది. ఇది ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

 

5. కొవ్వు తగ్గడం 
కార్డియో చేయడం వలన కొవ్వు అధికంగా బర్న్ అవుతుంది. మరియు కండరాలకు అధిక బలాన్ని ఇస్తుంది. రక్తంలో చక్కెర మరియు ఇన్సులిన్ నియంత్రణకు కార్డియో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.  కార్డియో, వ్యాయామం రెండింటిని ఒకే సారి చేయడం కంటే రోజు ఒక దానిని చేయడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. ఇది కండరాలను కోలుకునే సమయాన్ని ఇస్తుంది. దీని వలన శరీరం మరింత దృడంగా తయారవుతుంది.

 

గమనిక.. పైవిషయాలు కేవలం అవగాహనకోసం మాత్రమే. అభ్యసించే ముందు నిపుణుల సహాయం తీసుకోవడం తప్పనిసరి. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.

ఇవి కూడా చదవండి: