Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

Padi Kaushik Reddy Arrested in Hyderabad: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబెదారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసి అక్కడి నుంచి వరంగల్‌కు తరలించారు. ఈ మేరకు ఆయనపై సుబేదారి పోలీస్ స్టేషన్ లో 308(2), 308(4), 352 BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, ఏప్రిల్ 21వ తేదీన కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. తన భర్తను బెదిరించి రూ.25 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదులో మహిళ కట్టా ఉమాదేవి పేర్కొంది. మరో రూ.50 లక్షలు ఇవ్వాలని ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేసింది. తన భర్త, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.