Last Updated:

Actress Rajitha: ప్రముఖ నటి రజిత ఇంట తీవ్ర విషాదం

Actress Rajitha: ప్రముఖ నటి రజిత ఇంట తీవ్ర విషాదం

Actress Rajitha Mother Passed Away: ప్రముఖ నటి రజిత ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి విజయ లక్ష్మి (76) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో నటి రజిత ఇంట త్రీవ విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మి చెల్లెల్లు అవుతారు.

కాగా నటి రజిత 18 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చారు. సహాయ నటిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ, ఒడియా భాషల్లో దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించారు. సహాయ నటిగా తెలుగులో దాదాపు 200 సినిమాల్లో నటించారు. 1998లో పెళ్లి కానుక సినిమాకు గానూ ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డు అందుకున్నారు.

రజిత సినిమా విషయానికి వస్తే

కూలి నెం.1, ప్రేమ ఖైదీ, పెళ్లి సందడి, జులాయి, మల్లీశ్వరి, జులాయి, సరైనోడు, పండగ చేస్కో, పిల్లా నువ్వు లేని జీవితం, వీరసింహారెడ్డి వంటి చిత్రాల్లో నటించారు. చివరిగా గతేడాది రిలీజైన ఉషా పరిణయం చిత్రంలో కనిపించారు. తమిళంలో లింగా, విశ్వాసం, అన్నాత్తే, చంద్రముఖి 2 సినిమాల్లో నటించారు.