Last Updated:

Priyanka Chopra Belly Button: ఆ పార్ట్‌ కోసం అన్ని కోట్లా! – ప్రియాంక చోప్రా ధరించిన బెల్లీ బటన్‌ ధరెంతో తెలుసా?

Priyanka Chopra Belly Button: ఆ పార్ట్‌ కోసం అన్ని కోట్లా! – ప్రియాంక చోప్రా ధరించిన బెల్లీ బటన్‌ ధరెంతో తెలుసా?

Priyanka Chopra Belly Button Ring Cost: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ రూపోందుతోంది. ఈ సినిమాతోనే గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. SSMB29 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ ఒడిశాలో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో ప్రియాంక చోప్రా కూడా పాల్గొంది. ఇక ఒడిశా షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి కావడంతో న్యూయార్క్‌కు ఆమె తిరుగు పయనమైంది.

ఒడిశా షెడ్యూల్ పూర్తి

ఈ క్రమంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి చేరుకుంది. SSMB29 షూటింగ్‌ పూర్తి చేసుకుని వెళుతుండగా.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వద్ద ప్రియాంక తళుక్కున మెరిసింది. ఇక్కడ ఆమె మీడియాకు హాయ్‌ చెబుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక్కడ ప్రియాంక స్టైలిష్‌ లుక్‌లో కనిపించింది. బ్లాక్‌ అండ్‌ బ్లూ ప్యాంట్‌ షర్ట్‌ అవుట్‌ ఫిట్‌లో డాజిలింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. అయితే ఇక్కడ అందరిని ఎక్కువ ఆకట్టుకుంది మాత్రం ప్రియాంక బొడ్డు.

బెల్లీ బటన్ రింగ్ ధరెంతంటే..

ఇక్కడ ఆమె బొడ్డు రింగ్‌ (బెల్లీ బటన్‌) ధరించి కనిపించింది. దీంతో అందరి దృష్టి నాభిపై పడింది. ఆమె ధరించిన రింగ్‌ ఏంటని ఆరా తీయగా అవాక్కాయ్యే విషయం తెలిసింది. ఆమె ధరించిన బెల్లి బటన్‌ డైమండ్‌ది అట. దాని విలువ రూ. 2.7 కోట్లు అని అని తెలుస్తోంది. ఇది నెటిజన్స్‌ అంతా షాక్‌ అవుతున్నారు. ఇందకు సంబంధించిన వీడియో ఫోటోలు షేర్‌ చేస్తూ అంతా ఆమె బెల్లీ బటన్‌ గురించే చర్చించుకుంటున్నారు. ఒక్క బొడ్డుకే అన్ని కోట్ల ఆభరణం ధరిస్తే.. ఇక నెక్లేస్‌లు, రింగ్స్‌ ఎలా రేంజ్‌లో ఉంటాయో. ప్రియాంక చోప్రా మూములు రిచ్‌ కాదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

కాగా ప్రస్తుతం ప్రియాంక చోప్రా గ్లోబల్‌ రేంజ్‌లో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. సౌత్‌ ఇండియా నుంచి కెరీర్‌ మొదలు పెట్టిన ఆమె అతి తక్కువ టైంలోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్కడ వరు సినిమాలు చేస్తూ హిట్స్‌ అందుకుంది. స్టార్‌ హీరోల సరసన నటిస్తూ యమ క్రేజ్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత హాలీవుడ్‌పై కన్నేసింది. హాలీవుడ్‌ తొలుత వెబ్‌ సిరీస్‌లు చేసిన ప్రియాంక ఇక అక్కడే సెటిలైపోయింది. అక్కడ వరసుగా వెబ్‌ సిరీస్‌, సినిమాలు చేస్తూ హాలీవుడ్‌కే మాకాం మార్చింది. అదే టైంలో అమెరికన్‌ స్టార్‌ పాప్‌ సింగర్ నిక్‌ జోనస్‌తో ప్రేమలో పడింది. కొంతకాలం డేటింగ్‌ అనంతరం 2018లో నిక్‌ జోనస్‌ని పెళ్లాడింది. హిందు, క్రిస్టియన్‌ సంప్రదాయంలో రెండు రోజులు వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ జంటకు కూతురు మల్తీ జన్మించింది. ఇక పెళ్లై, కూతురు జన్మించినప్పటికీ ప్రియాంక క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ హాలీవుడ్‌లో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తోంది. ఇక వీలు చిక్కినప్పుడల్లా బాలీవుడ్ సినిమాల్లోనూ మెరుస్తుంది. త్వరలోనే SSMB29తో మహేష్‌తో జతకట్టి తెలుగు ఆడియన్స్‌ అలరించబోతుంది.