Last Updated:

Tamannaah: తమన్నా-విజయ్‌ వర్మ బ్రేకప్‌కు కారణమిదా..?

Tamannaah: తమన్నా-విజయ్‌ వర్మ బ్రేకప్‌కు కారణమిదా..?

Tamannaah and Vijay Varma Break Up: హీరోయిన్‌ తమన్నా, నటుడు విజయ్‌ వర్మ బ్రేకప్‌ చెప్పుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన లేదు. కానీ, రెండేళ్ల తమ ప్రేమకు బ్రేక్‌ చెప్పి.. మంచి స్నేహితులుగా ఉండాలని వారు నిర్ణయించుకున్నట్టు బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరు బ్రేకప్‌ చెప్పుకున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తుండటంతో దానికి కారణమేంటని నెటిజన్స్‌ ఆరా తీస్తున్నారు.

పెళ్లి విషయంలో మనస్పర్థలు?

ఈ క్రమంలో వారి బ్రేకప్‌కి కారణామేంటనేది సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం తమన్నా కెరీర్‌ అంతా సాఫీగా లేదనే విషయం తెలిసిందే. మెల్లిమెల్లిగా ఆమెకు ఆఫర్స్‌ తగ్గిపోయాయి. తెలుగులో అయితే అసలు ఆమెకు అవకాశాలే రావడం లేదు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ‘ఓదెల 2’లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 35. దీంతో పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిపోవాలని చూస్తోంది. ఇదే విషయం ప్రియుడు విజయ్‌ వర్మతో చెప్పింది.

రెండేళ్ల రిలేషష్ కి బ్రేక్

పెళ్లి చేసుకుందామని తన నిర్ణయాన్ని చెప్పగా.. దీనికి విజయ్‌ వర్మ సముఖత చూపించాడట. ప్రస్తుతం తాను కెరీర్‌పై ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నానని, పెళ్లి ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాడట. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయట. అప్పటి నుంచి తమన్నా, విజయ్‌ వర్మలు ఎడమోహం పెడమోహంతో ఉంటున్న వారు చివరికి బ్రేకప్‌ చెప్పుకున్నారట. అలా వీరి రెండేళ్ల ప్రేమకు బ్రేక్‌ పడిందని బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరీ ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే. కాగా తమన్నా, విజయ్‌ వర్మలు లస్ట్‌ స్టోరీస్‌ 2 వెబ్‌ సిరీస్‌లో తొలిసారి కలిసి నటించారు. ఈ సిరీస్ షూటింగ్‌లోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కొంతకాలంగా సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న వీరు 2023లో తమ రిలేషన్‌ ఆఫీషియల్‌ చేశారు. అప్పటి నుంచి బి-టౌన్‌లో చట్టపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట కొంతకాలంగా సింగిల్‌గా కనిపించడంతో వారి బ్రేకప్‌ రూమర్స్‌ మొదలయ్యాయి. మరి ఈ వార్తలపై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.